బుధవారం, మార్చి 20, 2019

ఢిల్లీ నుంచి గల్లీ దాకా...

చిత్రం సినిమాలోని ఒక హుషారైన పాటను తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.

చిత్రం : చిత్రం (2000)
సంగీతం : ఆర్.పి.పట్నాయక్ 
సాహిత్యం : కులశేఖర్
గానం : రవి వర్మ, కౌసల్య

పెద్దాపురం అమలాపురం
భోగాపురం పిఠాపురం
మైలవరం ఐలవరం
గన్నవరం అన్నవరం
భద్రాచలం సింహాచలం
నెల్లూరు అల్లూరు
ఏలూరు ఆలూరు
గుంటూరు గూడూరు
మోటూరు పాటూరు
చిత్తూరు పుత్తూరు
ఒంగోలు కర్నూలు
ద్వారపూడి కత్తిపూడి
సంగారెడ్డి రంగారెడ్డి
ఆకివీడు నూజివీడు
గాజువాక ఆరిపాక
బాంగ్ ళోర్ మాంగ్ ళోర్ 
ముంబై కలకటా.. ఢిల్లీ..

ఢిల్లీ నుంచి గల్లీ దాకా
ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఉన్నారండీ గర్ల్ ఫ్రెండ్సు
మళ్ళీ మళ్ళీ డౌటుందంటే ఇస్తాలెండీ రిఫరెన్సు
హల్లో అంటే అల్లుకుపోయే లేడీసున్నారూ
కల్లోనైనా కిస్సిమ్మంటూ వేధిస్తుంటారూ

ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఉన్నారండీ గర్ల్ ఫ్రెండ్సు
మళ్ళీ మళ్ళీ డౌటుందంటే ఇస్తాలెండీ రిఫరెన్సు

బెజవాడ లోన బేబీ గుడివాడలోన గౌరీ
బలివాడలోన గీతా సతివాడలోన సీత
మరువాడలోన హేమ పరవాడలోన ప్రేమ
దువ్వాడ లోన జూలీ ధార్వాడ లోన డాలీ
వాడ వాడల వాళ్ళు వచ్చి మనవాడని విలువిస్తారు
మాటి మాటికి మీదకొచ్చి మనువాడని విసిగిస్తారూ

ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఉన్నారండీ గర్ల్ ఫ్రెండ్సు
మళ్ళీ మళ్ళీ డౌటుందంటే ఇస్తాలెండీ రిఫరెన్సు

కొయ్.. కొయ్.. కొయ్.. కోతలు కోయ్ కోయ్..
కొయ్.. కొయ్.. కొయ్.. కోతలు కోయ్ కోయ్..
కొయ్.. కొయ్.. కొయ్.. కోతలు కోయ్ కోయ్..

హైద్రాబాదులో షైనీ సైదాబాదులో సోనీ
ఆసిఫ్ బాద్ లో ఆశా అలహాబాద్ లో రోసా
ఆదిలాబాద్ లో షీబా అహ్మదబాద్ లో శోభా
మొయినా బాదులో మోనా జాహనా బాదులో మీనా
బాదుబాదుల వాళ్ళు వచ్చీ జిందాబాదులు కొడతారూ
కోడి కూతకు ముందే వచ్చి అంతా బారులు కడతారూ

ఢిల్లీ నుంచి గల్లీ దాకా
ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఉన్నారండీ గర్ల్ ఫ్రెండ్సు
మళ్ళీ మళ్ళీ డౌటుందంటే ఇస్తాలెండీ రిఫరెన్సు
హల్లో అంటే అల్లుకుపోయే లేడీసున్నారూ
కల్లోనైనా కిస్సిమ్మంటూ వేధిస్తుంటారూ

ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఉన్నారండీ గర్ల్ ఫ్రెండ్సు
మళ్ళీ మళ్ళీ డౌటుందంటే ఇస్తాలెండీ రిఫరెన్సు

2 comments:

యూత్ఫుల్ సాంగ్..

అవును శాంతి గారు ఫుట్ టాపింగ్ సాంగ్ కూడా.. థాంక్స్ ఫర్ ద కామెంట్..

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.