బుధవారం, మార్చి 13, 2019

ఈశ్వరా నింగి నేల...

మనసులో మాట చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : మనసులో మాట (1999)
సంగీతం : ఎస్వీ కృష్ణారెడ్డి
సాహిత్యం : వేటూరి 
గానం : ఉదిత్ నారాయణ్

ఈశ్వరా నింగి నేల హాండ్‌షేక్
చేసిన ఘనతే నీదిరా
ఈశ్వరా సూర్యచంద్రులనొక్కటి
చేసిన కథయే నీదిరా

తూర్పు పడమర ఫ్రెండ్‌షిప్
చేసిన ఘటనే నీదిరా
వన్ ఇన్‌టూ ప్రాణేశ్వరా
వన్ ప్లస్ వన్ జీవేశ్వరా
ఆల్ ద బెస్ట్ ఆత్మేశ్వరా
ఆ మాటే ఆశీస్సురా
మండుటెండలు
మల్లెలు చేసిన ఈశ్వరా
ముళ్లు మెత్తని పూలుగ
మార్చిన ఈశ్వరా
జానెదేవ్ సహోదరా
జగడాలు లేవురా

ఈశ్వరా నింగి నేల హాండ్‌షేక్
చేసిన ఘనతే నీదిరా
ఈశ్వరా సూర్యచంద్రులనొక్కటి
చేసిన కథయే నీదిరా


కూచిపూడి నడగొచ్చులే ఒసిబిస
హాలివుడ్‌లో తీయొచ్చులే లవకుశ
మడోనాకు నేర్పొచ్చులే పదనిస
కొండకేసి లాగొచ్చులే పురికొస
కోకిల పాటల్లో స్నేహమే
కొమ్మకు సన్నాయి
కంటికి రెప్పల్లే కాచిన
స్నేహం మనదోయి
జానెదేవ్ సహోదరా
జగడాలు లేవురా॥


ఈశ్వరా నింగి నేల హాండ్‌షేక్
చేసిన ఘనతే నీదిరా
ఈశ్వరా సూర్యచంద్రులనొక్కటి
చేసిన కథయే నీదిరా


పార్లమెంటు నడగొచ్చులే పెళ్లికి
తాజ్‌మహల్‌ నడగొచ్చులే విడిదికి
జాక్సనొస్తే అడగొచ్చులే జావళే
బాలమురళి నడగొచ్చులే రాప్‌నే
కురిసిన మబ్బుల్లో స్నేహమే
రంగుల హరివిల్లు
మురిసిన నవ్వుల్లో స్నేహమే
మల్లెలు వెదజల్లు
జానెదేవ్ సహోదరా
జగడాలు లేవురా..

ఈశ్వరా నింగి నేల హాండ్‌షేక్
చేసిన ఘనతే నీదిరా
ఈశ్వరా సూర్యచంద్రులనొక్కటి
చేసిన కథయే నీదిరా

తూర్పు పడమర ఫ్రెండ్‌షిప్
చేసిన ఘటనే నీదిరా
వన్ ఇన్‌టూ ప్రాణేశ్వరా
వన్ ప్లస్ వన్ జీవేశ్వరా
ఆల్ ద బెస్ట్ ఆత్మేశ్వరా
ఆ మాటే ఆశీస్సురా
మండుటెండలు
మల్లెలు చేసిన ఈశ్వరా
ముళ్లు మెత్తని పూలుగ
మార్చిన ఈశ్వరా
జానెదేవ్ సహోదరా
జగడాలు లేవురా  

 

2 comments:

ఈశ్వరా అంటూ సాగే ఈ ఫ్రెండ్ షిప్ సాంగ్ తమాషాగా ఉంటుంది..

థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు...

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.