శనివారం, మార్చి 23, 2019

నామం పెట్టు...

ప్రేమ సాగరం చిత్రంలోని ఒక హుషారైన పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : ప్రేమసాగరం (1983)
సంగీతం : టి. రాజేందర్
సాహిత్యం : రాజశ్రీ
గానం : బాలు

నామం పెట్టు నామం పెట్టు కాలేజికి
చిన్నదాని చెయ్యే పట్టు మ్యారేజికి
నామం పెట్టు నామం పెట్టు కాలేజికి
చిన్నదాని చెయ్యే పట్టు మ్యారేజికి

అల్లరి కళ్ళ పడుచు పిల్ల
అల్లరి కళ్ళ పడుచు పిల్ల
చిందెయ్యని చిందెయ్యని నీ అందం
అయ్యో ఊరేగని ఊరేగని యవ్వనం
అయ్యో చిందెయ్యని చిందెయ్యని నీ అందం
అమ్మ ఊరేగని ఊరేగని యవ్వనం
అహ అహ అహ

నామం పెట్టు నామం పెట్టు కాలేజికి
చిన్నదాని చెయ్యే పట్టు మ్యారేజికి
నామం పెట్టు నామం పెట్టు కాలేజికి
చిన్నదాని చెయ్యే పట్టు మ్యారేజికి

ఆ..తకిట తకిట తా
అరె తళాంగు తకిట తా
అరె తరికిడితరికిడితరికిడి తా
అరె తకిడితకిడితకిడితకిడి తా

అయ్యయో.. అయ్యయో.. అయ్యయో.. అయ్యయో....
జీనతమనులాగ చీర సగము కట్టి
జయమాలిని లాగ భలే ఫోజు పెట్టి
జీనతమనులాగ చీర సగము కట్టి
జయమాలిని లాగ.. భలే ఫోజు పెట్టి

ఆదివారం నలుపు.. సొమవారం ఎరుపు
ఆదివారం నలుపు.. సొమవారం ఎరుపు
మంగళవారం పసుపు.. బుధవారం తెలుపు
నువ్వు వేసుకొచ్చే ఓణీలన్ని చూశామే
నీ బాడీలకు దాసోహమే చేసామే.. ఎహే ఎహే ఎహే

నామం పెట్టు నామం పెట్టు కాలేజికి
చిన్నదాని చెయ్యే పట్టు మ్యారేజికి
నామం పెట్టు నామం పెట్టు కాలేజికి
చిన్నదాని చెయ్యే పట్టు మ్యారేజికి

అహ ఉం అహ ఉం అహ ఉం. అహ హుం...

అమావాస్య వేళ.. ఆకతాయి పిల్ల
ఎవరికో సైగ చేస్తే.. తనకనే తలచి ఒకడు
అమావాస్య వేళ.. ఆకతాయి పిల్ల
ఎవరికో సైగ చేస్తే.. తనకనే తలచి ఒకడు

పౌడరెక్కువ పూసి.. చింపిరి జుట్టు దువ్వి
పౌడరెక్కువ పూసి.. చింపిరి జుట్టు దువ్వి
షోకులెన్నో చేసి.. వచ్చాడట పాపం
మీరు కాటుక మాత్రం రాయరమ్మ కళ్ళకు
పచ్చి కారం కూడా కొడతారమ్మ కళ్ళలో
ఒహొ ఒహొ ఒహొ

నామం పెట్టు నామం పెట్టు కాలేజికి
చిన్నదాని చెయ్యే పట్టు మ్యారేజికి
నామం పెట్టు నామం పెట్టు కాలేజికి
చిన్నదాని చెయ్యే పట్టు మ్యారేజికి

అల్లరి కళ్ళ పడుచు పిల్ల
అల్లరి కళ్ళ పడుచు పిల్ల
అమ్మ చిందెయ్యని చిందెయ్యని నీ అందం
ఊరేగని ఊరేగని యవ్వనం
అరె చిందెయ్యని చిందెయ్యని నీ అందం
అయ్యో ఊరేగని ఊరేగని యవ్వనం
అహ అహ అహహ

2 comments:

మా కాలేజ్ రోజుల్లో సెన్సేషనల్ సాంగ్..

అవునండీ అప్పట్లో ఒక ఊపేశాయ్ ఈ సినిమా అండ్ పాటలు :-) థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.