ఆదివారం, మార్చి 24, 2019

అనగనగా ఆకాశం ఉంది...

నువ్వే కావాలి చిత్రంలోని ఒక హుషారైన పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. ప్రవాసాంధ్రులు కెప్రాక్సీ లాంటి సైట్స్ ఉపయోగించి చూడవలసి రావచ్చు.

చిత్రం : నువ్వే కావాలి (2000)
సంగీతం : కోటి
సాహిత్యం : సిరివెన్నెల సీతారామ శాస్త్రి
గానం : చిత్ర , జయచంద్రన్

అనగనగా ఆకాశం ఉంది - ఆకాశంలో మేఘం ఉంది
మేఘం వెనుక రాగం ఉంది - రాగం నింగిని కరిగించింది
కరిగే నింగి చినుకయ్యింది - చినుకే చిటపట పాటయ్యింది
చిటపట పాటే తాకిన నేల - చిలకలు వాలే చెట్టయ్యింది
 
నా చిలక నువ్వే కావాలి - నా రాచిలక నవ్వే కావాలి
రాగాల గువ్వై రావాలి - అనురాగాల మువ్వై మోగాలి
 
ఊగే కొమ్మల్లోనా చిరుగాలి కవ్వాలి 
పాడి కచ్చేరి చేసే వేళల్లో
గుండెల గుమ్మంలోన సరదాలే సయ్యాటలు 
ఆడి తాళాలే వేసే వేళల్లో
కేరింతలే ఏ దిక్కున చూస్తున్నా కవ్వించగా
ఆఆఆఆఆఅ....ఆఆఆఆఆఆఆఅ....
ఆ నీ చెలిమే చిటికేసి నను పిలిచే నీకేసి
నీ చెలిమే చిటికేసి నను పిలిచే నీకేసి
నువ్ చెవిలో చెప్పే ఊసుల కోసం నేనొచ్చేసా పరుగులు తీసి
 
నా చిలక నువ్వే కావాలి  నా రాచిలక నవ్వే కావాలి 
 
అనగనగా ఆకాశం ఉంది - ఆకాశంలో మేఘం ఉంది
మేఘం వెనుక రాగం ఉంది - రాగం నింగిని కరిగించింది 
కరిగే నింగి చినుకయ్యింది - చినుకే చిటపట పాటయ్యింది
చిటపట పాటే తాకిన నేల - చిలకలు వాలే చెట్టయ్యింది
 
నా చిలక నువ్వే కావాలి - నా రాచిలక నవ్వే కావాలి
రాగాల గువ్వై రావాలి - అనురాగాల మువ్వై మోగాలి
 
చుక్కల లోకం చుట్టు తిరగాలి అనుకుంటూ
ఊహ ఊరేగే వెన్నెల దారుల్లో
నేనున్నా రమ్మంటూ ఓ తార నా కోసం
వేచి సావాసం పంచే సమయంలో
నూరేళ్లకీ సరిపోయే ఆశల్నీ పండించగా
ఆ స్నేహం చిగురించి ఏకాంతం పులకించి
అనుబంధాలే సుమగంధాలై ఆనందాలే విరబూస్తు ఉంటే
నా చిలక నువ్వే కావాలి - నా రాచిలక నవ్వే కావాలి

అనగనగా ఆకాశం ఉంది - ఆకాశంలో మేఘం ఉంది
మేఘం వెనుక రాగం ఉంది - రాగం నింగిని కరిగించింది
కరిగే నింగి చినుకయ్యింది - చినుకే చిటపట పాటయ్యింది
చిటపట పాటే తాకిన నేల - చిలకలు వాలే చెట్టయ్యింది
 
నా చిలక నువ్వే కావాలి - నా రాచిలక నవ్వే కావాలి
రాగాల గువ్వై రావాలి - అనురాగాల మువ్వై మోగాలి 

2 comments:

సాయి కిరణ్ బావుంటారు కానీ యెందుకో గుర్తింపు రాలేదు..

థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.