మంగళవారం, మార్చి 05, 2019

ఛీ..ఛీపా.. తప్పులకుప్పా...

మంత్రి గారి వియ్యంకుడు చిత్రంలోని ఒక సరదా పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : మంత్రిగారి వియ్యంకుడు (1983)
సంగీతం : ఇళయరాజా 
సాహిత్యం : వేటూరి
గానం : బాలు

ఛీ..చీపా.. పాపా.. తప్పులకుప్పా
బెక బెక బావురు కప్పా.. 
ఓ మైలేడీ డీ డీ నంబరువన్ కిలాడీ
నువ్వల్లాడీ డీడీ పోతావే అమ్మాడీ

ఛీ..చీపా.. పాపా.. తప్పులకుప్పా
బెక బెక బావురు కప్పా.. పపప..

మోటరు కారు ఎక్కినా కారు ఎక్కనివ్వకూ
గీర ఎంత ఎక్కినా గేరు మారనివ్వకూ
కళ్ళనించి కాచుకో ఒళ్ళు కాస్త దాచుకో
డబ్బులెక్క మానుకో డాబు మాని మేలుకో
అలుగుతున్న అందమా అమావాశ్య చంద్రమా
అలుగుతున్న అందమా అమావాశ్య చంద్రమా
పాడు బుద్ధి మానకుంటే దేహశుద్ధి తప్పదమ్మడూ

ఛీ..చీపా.. పాపా.. తప్పులకుప్పా
బెక బెక బావురు కప్పా.. పపప..

రోజూ ఫోజు కొట్టినా గాజుబొమ్మ నీవులే
ఆకు ముల్లు సామెతా తెలుసుకుంటె మేలులే
కుక్క కాటు నీదిలే చెప్పుదెబ్బ నాదిలే
ట్రిక్కులెన్ని చేసినా పప్పులింక ఉడకవే
బుసలు కొట్టు నాగమా పడగ కాస్త దించుమా
ఓయ్ బుసలు కొట్టు నాగమా పడగ కాస్త దించుమా
చెంపకాయ చేతికిస్తే లెంపకాయ తప్పదమ్మడూ

ఛీ..చీపా.. పాపా.. తప్పులకుప్పా
బెక బెక బావురు కప్పా.. పపప..
ఓ మైలేడీ డీ డీ నంబరువన్ కిలాడీ
నువ్వల్లాడీ డీడీ పోతావే అమ్మాడీ

ఛీ..చీపా.. పాపా.. తప్పులకుప్పా
బెక బెక బావురు కప్పా.. పపప..


2 comments:

మెగా స్టార్ కళ్ళు యెంత అందం గా ఉంటాయో బాపుగారి వల్లే తెలిసింది..

థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.