శుక్రవారం, మార్చి 15, 2019

లాయి లాయి...

ఎటో వెళ్ళిపోయింది మనసు చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : ఎటో వెళ్లిపోయింది మనసు (2012)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : అనంత శ్రీరామ్
గానం : ఇళయరాజా, బేలా శేండే

లాయి లాయి లా ఇలా ఈ హాయి నీదే సుమా
మాయలేవి మోయలేని ప్రాయమమ్మా
లాయి లాయి లా ఇలా ఈ తీపి నీవే సుమా
గాలి రంగులోన ఉన్న హృదయమమ్మా

లేత లేత చేతిలో చేతులేసి చేరుకో
ఊసులెన్నొ పంచుకున్న వేళలో
మనదే సరదా సరదా

లాయి లాయి లా ఇలా ఈ హాయి నీదే సుమా
మాయలేమి మోయలేని ప్రాయమమ్మా
లాయి లాయి లా ఇలా ఈ తీపి నీవే సుమా
గాలి రంగులోన ఉన్న హృదయమమ్మా


ఇంతలో ఇలా ఎదిగిన ఆ తలపులో
ఎవరికై ఈ పిలుపులో
వింత వింతగా తిరిగిన ఈ మలుపులో
తన జతే నువు కలుపుకో


ఇదంత చెప్పలేని ఈ భావనే పేరు ఉందో హో..
తెలియదు దానికైన ఈ వేళా
జవాబు చెప్పలేని ఈ ప్రశ్నలింకెన్ని ఎన్నో హో..
అవన్ని బయట పడవు ఇవ్వాళా

లోపలున్న అల్లరి ఓపలేని ఊపిరి
స్పర్శ లాగ పైకి వచ్చి లేనిపోనివేవో రేపిందా

లాయి లాయి లా ఇలా ఈ హాయి నీదే సుమా
మాయలేవి మోయలేని ప్రాయమమ్మా

లాయి లాయి లా ఇలా ఈ తీపి నీవే సుమా
గాలి రంగులోన ఉన్న హృదయమమ్మా

మాటిమాటికీ మొదలయే ఈ అలికిడి
మరుక్షణం ఓ అలజడి

ఆకతాయిగా తడిమితే ఈ తడబడి
తరగదే ఈ సందడి

చలాకి కంటి పూల తావేదొ తాకిందిలాగా హా
గులాబి లాంటి గుండె పూసేలా


ఇలాంటి గారడీల జోరింక చాలించదేలా హో
ఎలాగ ఏమనాలి ఈ లీలా
లోపలున్న అల్లరి ఓపలేని ఊపిరి
స్పర్శ లాగ పైకి వచ్చి లేని పోనివేవో రేపిందా


లాయి లాయి లా ఇలా ఈ హాయి నీదే సుమా
మాయలేవి మోయలేని ప్రాయమమ్మా
లాయి లాయి లా ఇలా ఈ తీపి నీవే సుమా
గాలి రంగులోన ఉన్న హృదయమమ్మా

లేత లేత చేతిలో చేతులేసి చేరుకో
ఊసులెన్నొ పంచుకున్న వేళలో
మనదే సరదా సరదా

లాయి లాయి లా ఇలా ఈ హాయి నీదే సుమా
మాయలేవి మోయలేని ప్రాయమమ్మా

లాయి లాయి లా ఇలా ఈ తీపి నీవే సుమా
గాలి రంగులోన ఉన్న హృదయమమ్మా 


2 comments:

ఈ మూవీ రీసెంట్ గా చూశాను..చాలా బావుంది..

థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు...

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.