బుధవారం, సెప్టెంబర్ 30, 2020

వింటున్నావా...

ఏ మాయ చేశావే చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : ఏ మాయ చేశావే (2010)
సంగీతం : ఏ.ఆర్.రెహ్మాన్  
సాహిత్యం : అనంత శ్రీరాం   
గానం : కార్తీక్, శ్రేయ ఘోషల్

పలుకులు నీ పేరే తలుచుకున్నా
పెదవుల అంచుల్లో అణుచుకున్నా 
మౌనముతో నీ మదిని బంధించా 
మన్నించు ప్రియా 

తరిమే వరమా తడిమే స్వరమా  
ఇదిగో ఈ జన్మ నీదని అంటున్నా
వింటున్నావా.. వింటున్నావా.. 
వింటున్నావా..

తరిమే వరమా తడిమే స్వరమా  
ఇదిగో ఈ జన్మ నీదని అంటున్నా
వింటున్నావా.. వింటున్నావా.. 
వింటున్నావా..
వింటున్నావా.. వింటున్నావా.. 

విన్నా వేవేల వీణల సంతోషాల సంకీర్తనలు 
నా గుండెల్లో ఇప్పుడే వింటున్నా
తొలి సారి నీ మాటల్లో 
పులకింతల పదనిసలు విన్నా  
చాలు చాలే చెలియా చెలియా  
బతికుండగా నీ పిలుపులు నేను విన్నా  
ఓ.. బతికుండగా నీ పిలుపులు నేను విన్నా 

ఏమో ఏమో ఏ..మవుతుందో 
ఏదేమైనా నువ్వే చూసుకో 
విడువను నిన్నే ఇకపైన 
వింటున్నావా ప్రియా 
గాలిలో తెల్ల కాగితంలా 
నేనలా తేలి ఆడుతుంటే 
నన్నే ఆపి నువ్వే రాసిన 
ఆ పాటలనే వింటున్నా  

తరిమే వరమా..తడిమే స్వరమా 
ఇదిగో ఈ జన్మ నీదని అంటున్నా
వింటున్నావా.. వింటున్నావా.. 
వింటున్నావా.. వింటున్నావా..
వింటున్నావా.. 

ఆద్యంతం ఏదో ఏదో అనుభూతి 
ఆద్యంతం ఏదో అనుభూతి  
అనవరతం ఇలా అందించేది  
గగనం కన్నా మునుపటిది  
భూతలం కన్నా ఇది వెనుకటిది  
కాలంతోన పుట్టిందీ కాలం లా మారే 
మనసే లేనిది ప్రేమ  

రా ఇలా కౌగిళ్ళల్లో నిన్ను దాచుకుంటా 
నీ దానినై నిన్నే దారిచేసుకుంటా
ఎవరిని కలువని చోటులలోన
ఎవరిని తలువని వేళలలోన 

తరిమే వరమా తడిమే స్వరమా 
ఇదిగో ఈ జన్మ నీదని అంటున్నా 
వింటున్నావా.. వింటున్నావా..
వింటున్నావా.. వింటున్నావా..
వింటున్నావా.. 

విన్నా వేవేల వీణల సంతోషాల సంకీర్తనలు 
నా గుండెల్లో ఇప్పుడే వింటున్నా 
తొలి సారి నీ మాటల్లో  
పులకింతల పదనిసలు విన్నా  

చాలు చాలే చెలియా చెలియా  
బతికుండగా నీ పిలుపులు నేను విన్నా  
చాలు చాలే చెలియా చెలియా 
బతికుండగా నీ పిలుపులు నేను విన్నా 
ఓ.. బతికుండగా నీ పిలుపులు నేను విన్నా 
 


0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.