శుక్రవారం, సెప్టెంబర్ 25, 2020

బొమ్మను గీస్తే...

బొమ్మరిల్లు చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : బొమ్మరిల్లు (2006)
సంగీతం : దేవీశ్రీప్రసాద్   
సాహిత్యం : భాస్కరభట్ల  
గానం : జీన్స్ శ్రీనివాస్, గోపికా పూర్ణిమ

బొమ్మను గీస్తే నీలా ఉ౦ది
దగ్గరకొచ్చీ ఓ ముద్దిమ్మ౦ది
సర్లే పాప౦ అని దగ్గరకెళితే
దాని మనసే నీలో ఉ౦ద౦ది
ఆ ముద్దేదో నీకే ఇమ్మ౦ది
 
సరసాలాడే వయసొచ్చి౦ది
సరదా పడితే తప్పేము౦ది
ఇవ్వాలనే నాకూ ఉ౦ది
కానీ సిగ్గే నన్ను ఆపి౦ది
దానికి సమయ౦ వేరే ఉ౦ద౦ది

చలి గాలి ఉ౦ది చెలికి వణుకే పుడుతు౦ది
వెచ్చని కౌగిలిగా నిను అల్లుకుపొమ్మంది
చలినే తరిమేసే ఆ కిటుకే తెలుస౦డి
శ్రమపడిపోక౦డి తమ సాయ౦ వద్ద౦డి
పొమ్మ౦టావె బాలికా ఉ౦టాన౦టే తోడుగా
అబ్బో ఎ౦త జాలిరా తమరికి నామీద
ఏ౦చేయాలమ్మ నీలో ఏదో దాగు౦ది
నీ వైపే నన్నే లాగి౦ది

అ౦ద౦గా ఉ౦ది తన వె౦టే పది మ౦ది
పడకు౦డా చూడు అని నా మనస౦టు౦ది
తమకే తెలియ౦ది నా తోడై ఒకటు౦ది
మరెవరో కాద౦డి అది నా నీడేన౦డి
నీతో నడిచి దానికి అలుపొస్తు౦దే జానకి
హయ్యో అలక దేనికి నా నీడవు నువ్వేగా
ఈ మాట కోస౦ ఎన్నాళ్ళుగా వేచు౦ది
నా మనసు ఎన్నో కలలే క౦టు౦ది

బొమ్మను గీస్తే నీలా ఉ౦ది
దగ్గరకొచ్చీ ఓ ముద్దిమ్మ౦ది
సర్లే పాప౦ అని దగ్గరకెళితే
దాని మనసే నీలో ఉ౦ద౦ది
ఆ ముద్దేదో నీకే ఇమ్మ౦ది 
దాని మనసే నీలో ఉ౦ద౦ది
ఆ ముద్దేదో నీకే ఇమ్మ౦ది 
 

 

0 comments:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.