సోమవారం, అక్టోబర్ 20, 2014

ఆ రోజు నా రాణి...

బృందావనం సినిమా నాకు చాలా ఇష్టమైన సినిమాలలో ఒకటి. దానిలోని పాటలు అన్నీ కూడా సూపర్ హిట్సే. నాకు ఇప్పటికీ ఆ పాటలు వింటూంటే ఈ సినిమా చూసిన రోజులు గుర్తొచ్చి ఒక చక్కని అనుభూతి పొందుతాను. ఈ సినిమాలో సరదాగా సాగే ఒక చక్కని పాటను మీరూ చూసీ వినీ ఆనందించండి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : బృందావనం (1992)
సంగీతం : మాధవపెద్ది సురేష్
రచన : వెన్నెలకంటి
గానం : ఎస్.పి.బాలు, ఎస్.జానకి

ఆ రోజు నా రాణి చిరునవ్వు చూసి
అనుకున్నా ఏదో నవ్వని
ఆ రోజు నా రాణి చిరునవ్వు చూసి
అనుకున్నా ఏదో నవ్వని
ఈ రోజే నాకు తెలిసింది
ఆ నవ్వున దాగుంది లవ్వని
ఎద జివ్వున లాగింది లవ్వని

ఆ రోజు నా రాజు చిరునవ్వు చూసి
అనుకున్నా ఏదో నవ్వని
ఆ రోజు నా రాజు చిరునవ్వు చూసి
అనుకున్నా ఏదో నవ్వని

ఈ రోజే నాకు తెలిసింది
ఆ నవ్వున దాగుంది లవ్వని
ఎద జివ్వున లాగింది లవ్వని

  
ఆ రోజు జాబిల్లి పగలే వచ్చింది
ఈరోజు జాజుల్లో సెగలే తెచ్చింది
ఆ రోజు ఓ చూపు వలలే వేసింది
ఈ రోజు మాపుల్లో కలలే తోచింది
 

కన్నులే వెన్నెలాయే వన్నెలే వెన్నలాయే
ముద్దులా ముచ్చటాయే నిద్దరే పట్టదాయే 

ఈ రోజే నాకు తెలిసింది
ఈ చిత్రాలు చేసింది లవ్వని
మధు పత్రాలు రాసింది లవ్వని
 
 
ఆ రోజు నా రాజు చిరునవ్వు చూసి
అనుకున్నా ఏదో నవ్వని 

 ఆ రోజు నా రాణి చిరునవ్వు చూసి
అనుకున్నా ఏదో నవ్వని
ఈ రోజే నాకు తెలిసింది
ఆ నవ్వున దాగుంది లవ్వని
ఎద జివ్వున లాగింది లవ్వని

 

ఆ రోజు కలలోన తొణికే ఓ ప్రేమ
ఈ రోజు ఇలలోన నిజమే చేద్దామా
 

ఆ రోజు మెరిసింది అందం చిరునామా
ఈ రోజు కలిసింది జతగా ఈ భామ
గుండెలో అల్లరాయే ఎండలే చల్లనాయే

 ఆశలే వెల్లువాయే ఊసులే చల్లిపోయే
ఈ రోజే నాకు తెలిసింది
రాగాలు రేపింది లవ్వని 

అనురాగాలు చూపింది నువ్వని
 

ఆ రోజు నా రాణి చిరునవ్వు చూసి
అనుకున్నా ఏదో నవ్వని
ఈ రోజే నాకు తెలిసింది
ఆ నవ్వున దాగుంది లవ్వని
ఎద జివ్వున లాగింది లవ్వని


ఆ రోజు నా రాజు చిరునవ్వు చూసి
అనుకున్నా ఏదో నవ్వని 

ఈ రోజే నాకు తెలిసింది
ఆ నవ్వున దాగుంది లవ్వని
ఎద జివ్వున లాగింది లవ్వని

  

4 comments:

Nice and soothing song ! It was picturized very decently although it's a romantic song.

$id

థాంక్స్ సిద్ గారు... అవునండీ ఈ సినిమా విడుదలైనపుడు "చందమామ విజయా కంబైన్స్" బ్యానర్ కు కూడా చాలా పొగడ్తలు వచ్చాయి బ్యానర్ పేరు ప్రతిష్టలకు తగ్గట్టు మంచి ఆహ్లాదకరమైన సినిమా తీశారు అని.

ఆఫ్టర్ ఏ లాంగ్ టైం చందమామ విజయ కంబైన్స్ వారి సినిమా..యెంతో ఎంజాయ్ చేశాము..మాధవపెద్ది గారి మ్యూజిక్ చాలా సూతింగ్ గా వుందీ మూవీలో..

అవునండీ చందమామ విజయా కంబైన్స్ ని అప్పట్లో చాలా మెచ్చుకున్నారు క్రిటిక్స్ అందరూ.. థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.