బుధవారం, అక్టోబర్ 29, 2014

వగల రాణివి నీవే...

పండు వెన్నెల్లో రామారావంతటి అందాగాడు మేడ దిగి రావే అని పాడితే రానమ్మాయి ఉంటుందా ? అఫ్ కోర్స్ మన కృష్ణకుమారి మాత్రం వెంటనే దిగిరాలేదులెండి. ఆ మత్తు కలిగించే పాటేమిటో వినాలనుకుంటే, ఆ చక్కని జంటను మీరూ చూడాలనుకుంటే చూసి.. వినేసేయండి మరి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : బందిపోటు (1963)
సంగీతం : ఘంటసాల
సాహిత్యం : సినారె
గానం : ఘంటసాల

ఓహోహో...ఓ... ఓ...
ఓహోహో... ఓ... ఓ...
ఓహోహోహో... ఓ... ఓ...

వగలరాణివి నీవే సొగసు కాడను నేనే
ఈడు కుదిరెను జోడు కుదిరెను మేడ దిగి రావే

వగల రాణివి నీవె సొగసు కాడను నేనె
ఈడు కుదిరెను జోడు కుదిరెను మేడ దిగి రావే
వగల రాణివి నీవే..

పిండి వెన్నెల నీ కోసం పిల్ల తెమ్మెర నా కోసం
పిండి వెన్నెల నీ కోసం పిల్ల తెమ్మెర నా కోసం
రెండు కలసిన నిండు పున్నమి రేయి మన కోసం

వగల రాణివి నీవే .. ఓహోహో ఓ...
ఒహోహో ఓ..
ఒహోహో ఓ..ఓ..

ఓహోహొ ఓఓఓ
ఓహోహొ ఓఓఓ

దోర వయసు చినదాన కోర చూపుల నెరజాణ
దోర వయసు చినదాన కోర చూపుల నెరజాణ
బెదరుటెందుకు కదలు ముందుకు ప్రియుడనేగాన
వగల రాణివి నీవే ..

కోపమంత పైపైనే చూపులన్నీ నాపైనే
కోపమంత పైపైనే చూపులన్నీ నాపైనే
వరుని కౌగిట ఒరిగినంతట కరిగి పోదువులె

వగలరాణివి నీవే.. సొగసు కాడను నేనే
ఈడు కుదిరెను జోడు కుదిరెను.. తోడుగా రావే...

వగల రాణివి నీవే .. ఓహోహో ఓ...
ఓహోహో ఓ...
ఓహోహో ఓఓఓ...


2 comments:

ఎన్.టి.ఆర్ యెంత అందగాడో..అంత గంభీరమైన వాయిస్..అప్పటికీ,ఇప్పటికీ,యెప్పటికీ..ఆయనకి లేరు సాటి..గుండెని వెయ్యి మైళ్ళ వేగం తో ఆ రోజుల్లోకి లాక్కు పోయే సాంగ్ వేణూజీ..

రామారావు గారి గురించి చాలా బాగా చెప్పారు శాంతి గారు.. థాంక్స్.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.