మంగళవారం, అక్టోబర్ 21, 2014

కమ్మని గీతాలే...

అంతం సినిమాలో నాకు నచ్చిన పాట ఈరోజు మీకోసం. ఈ పాటలో ఊర్మిళకి చిత్ర గారి గాత్రం బాగా నప్పింది. సిరివెన్నెల గారి సాహిత్యం చాలా బాగుంటుంది, తను అడవిలో ఉదయాన్ని వర్ణించిన తీరు, శీతాకోక చిలుకకు వనమంతా పరిచయమంటూ పరిచయానికి తనే బెస్ట్ గైడ్ అని చెప్పిన తీరు నాకు ఇష్టం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.



చిత్రం : అంతం (1992)
సంగీతం : ఆర్.డి. బర్మన్, మణిశర్మ
సాహిత్యం : సిరివెన్నెల 
గానం : చిత్ర

ఓ మైనా ..... ఆ ఆ
నీ గానం నే విన్నా ఆ ....ఆ ఆ
ఎటు ఉన్నా...ఆ ఆ ఆ ...
ఏటవాలు పాట వెంట రానా ... ఆ ఆ

కమ్మని గీతాలే పంపి రమ్మని పిలిచావే...
మరి రావే ఇకనైనా...
కొమ్మలనడిగానే ప్రతి రెమ్మని వెతికానే...
కనిపించవు కాస్తైనా...
నీ కోసం వచ్చానే... సావాసం తెచ్చానే
ఏదీ రా మరి ఏ మూలున్నా...

కమ్మని గీతాలే పంపి రమ్మని పిలిచావే...
మరి రావే ఇకనైనా...
కొమ్మలనడిగానే ప్రతి రెమ్మని వెతికానే...
కనిపించవు కాస్తైనా...
లాల్లలలల్లల్లా లాలలాలలలల్లల్లా
లలలాలాలాలాలాలా ...

ఎవరైనా...ఆ ఆ ఆ...
చూశారా ఎపుడైనా...ఆ ఆ ఆ
ఉదయానా....ఆ ఆ ఆ...
కురిసే వన్నెల వానా... హో..
కరిమబ్బులాంటి నడిరేయి కరిగి కురిసింది కిరణాలుగా..
ఒక్కొక్క తారా చినుకల్లె జారి... వెలిసింది తొలికాంతిగా.. ఆ..
కరిమబ్బులాంటి నడిరేయి కరిగి కురిసింది కిరణాలుగా
ఒక్కొక్క తారా చినుకల్లె జారి... వెలిసింది తొలికాంతిగా
నీలాకాశంలో... వెండి సముద్రంలా... పొంగే ...

కమ్మని గీతాలే పంపి రమ్మని పిలిచావే...
మరి రావే ఇకనైనా...
కొమ్మలనడిగానే ప్రతి రెమ్మని వెతికానే...
కనిపించవు కాస్తైనా...

 
నన్నేనా....ఆ ఆ ఆ....
కోరుకుంది ఈ వరాల కోనా.....హో
ఏలుకోనా....ఆ ఆ ఆ....
కళ్ళ ముందు విందులీ క్షణానా ....హో
సీతాకోకచిలుకా తీసుకుపో నీ వెనుకా... వనమంతా చూపించగా...
ఆ మొక్క ఈ మొలక అన్నీ తెలుసు కనుక ... వివరించు ఇంచక్కగా...
సీతాకోకచిలుక తీసుకుపో నీ వెనుక... వనమంతా చూపించగా...
ఆ మొక్క ఈ మొలక అన్నీ తెలుసు కనుక... వివరించు ఇంచక్కగా... 
కీకారణ్యంలో నీ రెక్కే దిక్కై... రానా ...

కమ్మని గీతాలే పంపి రమ్మని పిలిచావే...
మరి రావే ఇకనైనా...
కొమ్మలనడిగానే ప్రతి రెమ్మని వెతికానే...
కనిపించవు కాస్తైనా...
నీ కోసం వచ్చానే...సావాసం తెచ్చానే...
ఏదీ రా మరి... ఏ మూలున్నా ...
 


ఆహహహహ్హహ్హా ఓహోహోహోహోహ్హోహ్హో
లలలాలా హ్మ్మ్...హ్మ్మ్ హ్మ్మ్ హ్మ్మ్
డూడుడుడుడుడూ... ఓహోహొహొహొహొహో...
లలలాలాలాలాలాలా...

2 comments:

టిపికల్ కంపోజిషన్..వినేటపుడు యెంత హాయిగా వుంటుందో, పాడటం అంత కష్టం..

అవును శాంతి గారు... థాంక్స్ ఫర్ ద కామెంట్.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.