బుధవారం, అక్టోబర్ 22, 2014

కాదు సుమా కలకాదు సుమా...

ఈ జంట ఎవరో ఒక కీలుగుఱ్ఱమును ఎక్కి ఆకాశయానం చేస్తూ ఇది కల కాదు సుమా అని ఒక కమ్మని పాట పాడుకుంటున్నారు, ఏవిటో ఆ విశేషం మనమూ వారితో కాసేపు విహరించి చూద్దాం పదండి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేయవచ్చు.


చిత్రం : కీలుగుఱ్ఱం (1949)
సాహిత్యం : తాపీ ధర్మారావు నాయుడు
సంగీతం : ఘంటసాల
గానం : ఘంటసాల, వక్కలంక సరళ

కాదు సుమా కల కాదు సుమా
కాదు సుమా కల కాదు సుమా
అమృత పానమును అమర గానమును
అమృత పానమును అమర గానమును
గగన యానమును కల్గినట్లుగా
గాలిని తేలుచూ సోలిపోవుటిది
కాదు సుమా కల కాదు సుమా

 
ప్రేమలు పూచే సీమల లోపల
ప్రేమలు పూచే సీమల లోపల
వలపులు పారే సెలయేరులలో
తే టి పాటలను తేలియాడితిని

కాదు సుమా కల కాదు సుమా

కన్నె తారకల కలగానముతో
కన్నె తారకల కలగానముతో
వెన్నెల చేరుల ఉయ్యాలలో
ఓ... ఓ... ఓహో... ఓ... ఓ... ఒహో...
వెన్నెల చేరుల ఉయ్యాలలో
ఉత్సాహముతో ఊగుచుండుటిది

కాదు సుమా కల కాదు సుమా

 
పూల వాసనల గాలి తెరలలో
వలపు చీకటుల వన్నె కాంతిలో
పూల వాసనల గాలి తెరలలో
వలపు చీకటుల వన్నె కాంతిలో
ఆహా... ఆ... ఆ... ఆహా... ఆ... ఆ...
దోబూచులాడుటిది

కాదు సుమా కల కాదు సుమా
కాదు సుమా కల కాదు సుమా


3 comments:

మీర్జాపురం మహారాజుగారు నిర్మించిన దీ సినిమా..టైటిల్స్ మ్యూజిక్ లో వెస్టెర్నైస్డ్ బిట్స్ వుంటాయి..సూపర్బ్ మూవీ అండీ..చిన్నప్పుడు నేనూ అక్కా అంజలీదేవిలా కళ్లు తిప్పుతుండేవాళ్ళం..యెవరైనా నచ్చని పని చెప్తే..

అన్నట్టు వేణూజీ..ఇందులోనిదె యెంత దయామయివె భవాని వీలైతే ప్రెజెంట్ చేస్తారా..

హహహ మీ సరదా జ్ఞాపకం బాగుందండీ.. మీ అక్కగారికి కూడా గుర్తు చేయండి నవ్వుకుంటారు :-) తప్పకుండా మీరడిగిన మరో పాట కూడా త్వరలో పోస్ట్ చేస్తాను.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.