ధర్మాత్ముడు సినిమా కోసం కృష్ణంరాజు జయసుధలపై చిత్రీకరించిన ఈ పాట సరదాగా సాగుతూ అలరిస్తుంది. బాలూ సుశీల గారు కూడా అలాగే ఎంజాయ్ చేస్తూ పాడారు అనిపిస్తుంటుంది. చిన్నప్పుడు రేడియోలో విన్నవెంటనే లిరిక్స్ కి అర్ధం పెద్దగా తెలియకపోయినా సత్యం గారి క్యాచీ ట్యూన్ ఆకట్టుకుని ఈజీగా ఉండి మ్యూజిక్ తో సహా తెగ హమ్ చేసేసే వాడ్ని. మైలవరపు గోపీ గారి లిరిక్స్ సింపుల్ అండ్ స్వీట్ అన్నట్లుగా ఉంటాయి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.
చిత్రం : ధర్మాత్ముడు (1983)
సంగీతం : సత్యం
సాహిత్యం : మైలవరపు గోపి
గానం : బాలు, సుశీల
ఓ గోపెమ్మో.. ఇటు రావమ్మో
ఈ దాసుని తప్పు దండంతో సరి మన్నించవమ్మో
ఓ కిష్టయ్యో రాను పోవయ్యో
నీ గడసరి మాటలు గారడి చేష్టలు చాలించవయ్యో...
ఓ గోపెమ్మో.. ఇటు రావమ్మో
సంగీతం : సత్యం
సాహిత్యం : మైలవరపు గోపి
గానం : బాలు, సుశీల
ఓ గోపెమ్మో.. ఇటు రావమ్మో
ఈ దాసుని తప్పు దండంతో సరి మన్నించవమ్మో
ఓ కిష్టయ్యో రాను పోవయ్యో
నీ గడసరి మాటలు గారడి చేష్టలు చాలించవయ్యో...
ఓ గోపెమ్మో.. ఇటు రావమ్మో
సొగసే నీ అలకలు కూడా
సొగసే ఓ ముద్దుల గుమ్మా
ఈ ఒకసారికి చిరాకు పరాకు పడబోకే...
తెలుసే ఇది రోజూ ఉండే వరసే
చిరు చీకటి పడితే.. కౌగిట చేరగ తపించి తపించి పోతావే?
న్యాయము కాదిది.. సమయము కాదిది..
న్యాయము కాదిది.. సమయము కాదిది..
గోపెమ్మో ఇటు రావమ్మో
ఈ దాసుని తప్పు దండంతో సరి మన్నించవమ్మో
నీ గడసరి మాటలు గారడి చేష్టలు చాలించవయ్యో...
ఓ కిష్టయ్యో రాను పోవయ్యో
మదిలో తొలిరాతిరి తలపే మెదిలే నిను చూస్తూ ఉంటే
ఎదలో కోరిక కలుక్కు కలుక్కు మంటుంటే...
ఇపుడే ఈ సరసాలన్నీ ఇపుడే ఈ ముచ్చటలన్నీ
మురిపము తీరగ హుళక్కి హుళక్కి అవుతాయే
నమ్మవే నా చెలి.. నమ్మకమేమిటి?
నమ్మవే నా చెలి.. నమ్మకమేమిటి?
గోపెమ్మో.. ఊ.. ఇటు రావమ్మో..ఊ..
ఈ దాసుని తప్పు దండంతో సరి మన్నించవమ్మో
ఈ దాసుని తప్పు దండంతో సరి మన్నించవమ్మో
ఓ కిష్టయ్యో రాను పోవయ్యో
నీ గడసరి మాటలు గారడి చేష్టలు చాలించవయ్యో...
ఈ గడసరి మాటలు గారడి చేష్టలు చాలించవయ్యో...
ఓ గోపెమ్మో.. రాను పోవయ్యో
ఓ గోపెమ్మో.. రాను పో...వయ్యో...
2 comments:
బానేవుందీ పాట..
థాంక్సండీ...
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.