ఆదివారం, అక్టోబర్ 19, 2014

ఎంతవారు కానీ...

మొహమ్మద్ రఫీ గారు తెలుగులో పాడిన ఈ సరదా ఐన పాటను ఈ ఆదివారం గుర్తు చేసుకుందాం. నేను ఎలాంటి మూడ్ లో ఎలాంటి సమయంలో ఈపాట విన్నా కూడా పెదవుల మీదకి ఒక చిరునవ్వు వచ్చిచేరుతుందనడంలో ఏ సందేహంలేదు. "బార్ బార్ దేఖో" అనే పాటకు తెలుగు రూపమే అయినా ఒక ఎవర్ లాస్టింగ్ ట్రూత్ ను ఇంత చక్కగా చెప్పిన సినారె గారిని అభినందిస్తూ.. నాకు చాలా ఇష్టమైన ఈపాట మీరూ వినండి. ఈ పాట ఆడియో వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. చిత్రం : భలేతమ్ముడు (1969)
సంగీతం : టి.వి.రాజు 
సాహిత్యం : సినారె 
గానం : మొహమ్మద్ రఫీ

ఎంతవారు గాని వేదాంతులైన గాని
వాలు చూపు సోకగానే తేలిపోదురోయ్
కైపులో కైపులో కైపులోఓఓ...
 
ఎంతవారు గాని వేదాంతులైన గాని
వాలు చూపు సోకగానే తేలిపోదురోయ్
కైపులో కైపులో కైపులోఓఓ...

 

చిన్నది మేనిలో మెరుపున్నది హహ
చేపలా తళుకన్నది సైప లేకున్నది
చిన్నది మేనిలో మెరుపున్నది
చేపలా తళుకన్నది సైప లేకున్నది
ఏ వన్నెకాని వలపు నమ్మి వలను చిక్కునో
కైపులో కైపులో కైపులోఓఓ..
 
ఎంతవారు గాని వేదాంతులైన గాని
వాలు చూపు సోకగానే తేలిపోదురోయ్
కైపులో కైపులో కైపులోఓఓ...

ఆడకు వయసుతో చెరలాడకు ఆహా
ఆడితే వెనుకాడకు ఊహూ కూడి విడిపోకు
ఆడకు వయసుతో చెరలాడకు
ఆడితే వెనుకాడకు కూడి విడిపోకు
మనసు తెలిసి కలిసి మెలిసి వలపు నింపుకో..
కైపులో కైపులో కైపులోఓఓ..
 
ఎంతవారు గాని వేదాంతులైన గాని
వాలు చూపు సోకగానే తేలిపోదురోయ్
కైపులో కైపులో కైపులోఓఓ...

హహహ ఓ భలే భలే లేత వయసుడికిందిలే
తాత మనసూరిందిలే లోకమింతేలే..
హహహ ఓ భలే భలే లేత వయసుడికిందిలే
తాత మనసూరిందిలే లోకమింతేలే..
ఓయ్ పాత రుచులు తలచి తలచి తాత ఊగెనోయ్..
కైపులో కైపులో కైపులోఓఓ..
 
ఎంతవారు గాని వేదాంతులైన గాని
వాలు చూపు సోకగానే తేలిపోదురోయ్
కైపులో కైపులో కైపులోఓఓ...


2 comments:

చిన్నప్పుడు ఈ పాట పాడేదాన్నట వేణూజీ..అయితే కైపులో అనే పదాన్ని సైకిలో అని పాడేదాన్నట..తెలీక..అమ్మ యెప్పుడూ చెప్పి నవ్వేది..

హహహహ సైకిలో బాగుందండీ :-) థాంక్స్ ఫర్ షేరింగ్ శాంతి గారు.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.