శుక్రవారం, అక్టోబర్ 24, 2014

ఏడనున్నాడో ఎక్కడున్నాడో...

రాజమకుటం సినిమాలోని ఒక చక్కని పాట మీకోసం... చూసీ వినీ ఆనందించండి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : రాజమకుటం ( 1961)
సంగీతం :  మాస్టర్ వేణు

సాహిత్యం : అనిశెట్టి
గానం :  పి. లీల

ఓహొహొహో.. ఓహొహొహో..హోయ్
ఏడనున్నాడో ఎక్కడున్నాడో..
నా చుక్కల ఱేడు.. 
ఏడనున్నాడో ఎక్కడున్నాడో..
 చూడ చక్కని చుక్కల ఱేడు.. 
ఈడు జోడు కలిసినవాడు
ఏడనున్నాడో ఎక్కడున్నాడో..
నా చుక్కల ఱేడు.. ఏడనున్నాడో ఎక్కడున్నాడో..
హేయ్..

ఓహొహొహో.. ఓహొహొహో..

గాలి రెక్కల పక్షుల్లారా..ఆ..
గాలి రెక్కల పక్షుల్లారా.. 
పాల వన్నెల మబ్బుల్లారా..ఓ.. ఓ.. ఓ..
గాలి రెక్కల పక్షుల్లారా.. 
పాల వన్నెల మబ్బుల్లారా
పక్షుల్లారా.. మబ్బుల్లారా..
మనసు చూరగొని మాయమైన మక్కువ ఱేడే..

ఏడనున్నాడో ఎక్కడున్నాడో...
నా చుక్కల ఱేడు.. ఏడనున్నాడో ఎక్కడున్నాడో
హేయ్.. 
  
ఓ.. ఓ..ఓ..ఓ..
పొగడపొన్నల పువ్వలవీడ..
పొగడపొన్నల పువ్వలవీడ.. 
పూల వీధిలో తుమ్మెదున్నాడా
పొగడపొన్నల పువ్వలవీడ.. 
పూల వీధిలో తుమ్మెదున్నాడా
గున్నమామిడి కొమ్మలగూడా.. 
గూటిలోన గండు కోయిలలేడా
గున్నమామిడి కొమ్మలగూడా.. 
గూటిలోన గండు కోయిలలేడా
కోయిలలేడా.. తుమ్మెదున్నాడా..
కులుకు బెలుకుగల కోడె ప్రాయపు కొంటివాడే..

ఏడనున్నాడో ఎక్కడున్నాడో
నా చుక్కల ఱేడు.. ఏడనున్నాడో ఎక్కడున్నాడో
చూడచక్కని చుక్కలరేడు.. ఈడు జోడు కలిసినవాడు
ఏడనున్నాడో ఎక్కడున్నాడో..
నా చుక్కల ఱేడు.. ఏడనున్నాడో ఎక్కడున్నాడో

4 comments:

మంచి పాట. అదే సినిమాలో "సడి సేయకే గాలి ....." అనే పాట కూడా చాలా బాగుంటుంది.

థాంక్స్ నరసింహారావు గారు... అవునండీ ఆ పాట కూడా చాలా మంచి పాట.

ఈ సినిమాలో అన్ని పాటలూ బావుంటాయండీ..ముఖ్యం గా రాజసులోచన సాంగ్ "కింగన కింగన జిల్లా" అనుకుంటా ..ఆ పాట చివరలో రాజసులోచన యెన్.టి.ఆర్ ని చంపటానికి ట్రై చేసే సీన్లో ఆయన యాక్షన్ అద్భుతం అండీ..

ఓ ఇంట్రెస్టింగ్ శాంతి గారు పాట లిరిక్కే వెరైటీగా ఉంది :-) థాంక్స్ ఫర్ ద కామెంట్.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.