గురువారం, అక్టోబర్ 23, 2014

దీపావళీ దీపావళి...

దీపావళి సందర్బంగా మిత్రులందరకూ హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ సందర్బంగా ఎన్టీఆర్ గారి షావుకారు సినిమాలోని ఒక చక్కని పాట తలచుకుందామా. జానకి గారి ఇంటిపేరును షావుకారు గా మార్చేసిన ఈ సినిమా గురించి తెలియని తెలుగు వారు బహుశా తక్కువే ఉంటారేమో. ఈ పాట చిత్రీకరణ నాకు బాగా నచ్చుతుంది, మీరూ చూసి వినీ ఆనందించండి. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : షావుకారు (1950)
సంగీతం : ఘంటసాల 
సాహిత్యం : సముద్రాల 
గానం : జిక్కి, రావు బాల సరస్వతి

దీపావళీ దీపావళి దీపావళీ దీపావళి
ఇంటింట ఆనంద దీపావళీ
ఇంటింట ఆనంద దీపావళీ
మా ఇంట మాణిక్య కళికావళి
మా ఇంట మాణిక్య కళికావళి
దీపావళీ దీపావళి దీపావళీ దీపావళి

జిలుగుల వలువల అళ్ళుళ్ళ తళుకు
జిలుగుల వలువల అళ్ళుళ్ళ తళుకు కూతుళ్ళ కులుకు
పలుకుల వయ్యారి వదినెల వన్నెలు
పలుకుల వయ్యారి వదినెల వన్నెలు మురిసిపడు చిన్నెలు
రంగు మతాబుల శోభావళి
రంగు మతాబుల శోభావళి

దీపావళీ దీపావళి
ఇంటింట ఆనంద దీపావళి
మా ఇంట మాణిక్య కళికావళి
దీపావళీ దీపావళి

 
చిటపట రవ్వల ముత్యాలు కురియ
చిటపట రవ్వల ముత్యాలు కురియ రత్నాలు మెరయ
తొలకరి స్నేహాలు వలుపుల వానగ
తొలకరి స్నేహాలు వలుపుల వానగ కురిసి సెలయేరుగ
పొంగే ప్రమోద తరంగావళీ
పొంగే ప్రమోద తరంగావళి

దీపావళీ దీపావళి
దీపావళీ దీపావళి
ఇంటింట ఆనంద దీపావళీ
ఇంటింట ఆనంద దీపావళీ
మా ఇంట మాణిక్య కళికావళీ
మా ఇంట మాణిక్య కళికావళీ
దీపావళీ దీపావళి
దీపావళీ దీపావళి


~*~*~*~*~*~*~*~*~*~*~
 

అలాగే "ఈ దీపావళికి సగం దీపాలు మన హృదయంలో వెలిగిద్దాం ఆ వెలుగును విశాఖ కళ్ళల్లో చూస్తూ పండగ చేస్కుందాం" అంటూ చిత్రీకరించిన ఈ షార్ట్ ఫిల్మ్ చూసి నచ్చితే మీరూ పాటించండి.

2 comments:

బిలీటెడ్ విషెస్ వేణూజి..దీఫావళి శుభాకాంక్షలు..

థాంక్స్ శాంతి గారు... :-)

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.