ఈరోజు పరమ పవిత్రమైన కార్తీక సోమవారం కనుక ఆ సర్వేశ్వరుడిని తలచుకొంటూ నాగుల చవితి సినిమాలోని ఈ పాట గుర్తు చేసుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు.
చిత్రం : నాగుల చవితి (1956)
సంగీతం : గోవర్థనం, సుదర్శనం
సాహిత్యం : పరశురాం
గానం : టి.ఎస్.భగవతి
ఓం నమఃశ్శివాయః ఓం నమఃశ్శివాయః
ఓం నమఃశ్శివాయః ఓం నమఃశ్శివాయః
ఓం నమో నమో నటరాజ నమో
హర జటాజూటధర శంభో
ఓం నమో నమో నటరాజ
నమో నమో నటరాజ
ఓం నమో నమో నటరాజ నమో
హర జటాజూటధర శంభో
ఓం నమో నమో నటరాజ
నమో నమో నటరాజ
గంగా గౌరి హృదయ విహారి
గంగా గౌరి హృదయ విహారి
లీలా కల్పిత సంసారి
లీలా కల్పిత సంసారి
గంగా గౌరి హృదయ విహారి
లీలా కల్పిత సంసారి
భళిరే భాసుర బ్రహ్మచారి
భళిరే భాసుర బ్రహ్మచారి
భావజ మద సంహారి
భావజ మద సంహారి
ఓం నమో నమో నటరాజ నమో
హర జటాజూటధర శంభో
ఓం నమో నమో నటరాజ
నమో నమో నటరాజ
ఫణిభూషా బిక్షుకవేషా
ఫణిభూషా బిక్షుకవేషా
ఈశాత్రిభువన సంచారి
ఈశాత్రిభువన సంచారి
అఖిలచరాచర అమృతకారీ
అఖిలచరాచర అమృతకారీ
హాలాహల గళధారి
హాలాహల గళధారి
ఓం నమో నమో నటరాజ నమో
హర జటాజూటధర శంభో
ఓం నమో నమో నటరాజ
నమో నమో నటరాజ
మహాదేవ జయ జయ శివశంకర
జయ శివశంకర
జయ త్రిశూలధర జయ డమరుక ధర
జయ డమరుక ధర
హే దేవాది దేవ మహేశ జయజయ శ్రీ గౌరీశా
హే దేవాది దేవ మహేశ జయజయ శ్రీ గౌరీశా
జయజయ శ్రీ గౌరీశా
ఓం నమో నమో నటరాజ
నమో హర జటాజూటధర శంభో
ఓం నమో నమో నటరాజ
నమో నమో నటరాజ
ఓం నమో నమో నటరాజ
నమో నమో నటరాజ
ఓం నమఃశ్శివాయః ఓం నమఃశ్శివాయః
ఓం నమఃశ్శివాయః ఓం నమఃశ్శివాయః
~*~*~*~*~*~*~*~*~*~*
అలాగే ఈరోజు కార్తీక పౌర్ణమి తోపాటు నాగుల చవితి కూడా కనుక ఇదే సినిమాలోని ఈ పాట గుర్తు చేసుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు
చిత్రం : నాగుల చవితి (1956)
సంగీతం : గోవర్థనం, సుదర్శనం
సాహిత్యం : పరశురాం
గానం : ఎమ్.ఎల్.వసంత కుమారి
నటరాజు తలదాల్చు నాగ దేవా
నల్లనయ్య శయ్య నీవే నాగదేవా
నటరాజు తలదాల్చు నాగ దేవా
నల్లనయ్య శయ్య నీవే నాగదేవా
నిన్ను గొల్చు వారి ప్రాపు నీవేగావా
నిన్ను గొల్చు వారి ప్రాపు నీవేగావా
నాగస్వరం ఆలపింతూ ఆడరావా
ఆడరావా నాగదేవా ఆడరావా నాగదేవా
నాగస్వరం ఆలపింతూ ఆడరావా
ఆడరావా నాగదేవా
భువనైక నాధు శివుని భూషణమీవే..ఏ..
భువనైక నాధు శివుని భూషణమీవే..ఏ..
కరుణామయి గౌరి కర కంకణము నీవే
పాలకడలి చిల్కు వేల్పు రజ్జువు నీవే
పాలకడలి చిల్కు వేల్పు రజ్జువు నీవే
రవి చంద్రుల పట్టి మ్రింగు రాహుకేతువీవే
ఆడరావా నాగదేవా ఆడరావా నాగదేవా
నాగస్వరం ఆలపింతూ ఆడరావా
ఆడరావా నాగదేవా
2 comments:
'ఓం నమో నమో" పాటలో పరమశివుని మూర్తిని చూస్తుంటే సాక్షాత్ నటరాజే దిగి వచ్చినట్టుందండీ..ఇక 'నటరాజు తలదాల్చు" లో యెం.యెల్.వసంతకుమారిగారి వాయిస్, ఈ.వీ.సరోజ నృత్యం ఓ అద్భుతమైన కాంబినేషన్..
థాంక్స్ శాంతి గారు. అవునండీ రెండిటికి రెండూ చక్కని పాటలు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.