శనివారం, అక్టోబర్ 25, 2014

తేట తేట తెలుగులా...

ప్రేమనగర్ సినిమాలోని ఈ పాట మొదట్లో వచ్చే మ్యూజిక్ బిట్ నాకు చాలా ఇష్టం. మిగిలిన వాయిద్యాలతో పాటు దువ్వెనపై పలికించినట్లుగా వినిపించే బిట్ గమ్మత్తుగా ఉంటుంది. ఇక పాటలోని ఆత్రేయ గారి సాహిత్యం గురించీ, మహదేవన్ గారి సంగీతం గురించీ, ఘంటసాల గారి గాత్రం గురించీ ఎంత చెప్పినా తక్కువే. ఈ అచ్చతెలుగు పాటను మీరూ వినీ చూసీ ఆనందించండి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : ప్రేమనగర్ (1971)
సంగీతం : కె.వి. మహదేవన్
సాహిత్యం : ఆచార్య ఆత్రేయ
గానం : ఘంటసాల

తేట తేట తెలుగులా... తెల్లవారి వెలుగులా
తేరులా.. సెలయేరులా.. కల కలా.. గల గలా
కదలి వచ్చింది.. కన్నె అప్సరా
వచ్చి నిలిచింది.. కనుల ముందరా..

తేట తేట తెలుగులా... తెల్లవారి వెలుగులా
తేరులా.. సెలయేరులా.. కల కలా.. గల గలా
కదలి వచ్చింది.. కన్నె అప్సరా
వచ్చి నిలిచింది.. కనుల ముందరా..

 
తెలుగువారి ఆడపడుచు ఎంకిలా
ఎంకి కొప్పులోని.. ముద్దబంతి పువ్వులా..ఆఅ..
తెలుగువారి ఆడపడుచు ఎంకిలా
ఎంకి కొప్పులోని.. ముద్దబంతి పువ్వులా
గోదారి కెరటాల గీతాల వలె నాలో
పలికినది..... పలికినది.... పలికినది
చల్లగా చిరుజల్లుగా... జల జల గల గలా
 
కదలి వచ్చింది కన్నె అప్సరా
వచ్చి నిలిచిందీ కనుల ముందరా
తేట తేట తెలుగులా... తెల్లవారి వెలుగులా...

 
రెక్కలొచ్చి ఊహలన్ని ఎగురుతున్నవి
ప్రేమమందిరాన్ని చుక్కలతో చెక్కుతున్నవీ..ఈ..
రెక్కలొచ్చి ఊహలన్ని ఎగురుతున్నవి
ప్రేమమందిరాన్ని చుక్కలతో చెక్కుతున్నవి
లోలోన.. నాలోన.. ఎన్నెన్నో రూపాలు
వెలసినవి..... వెలసినవి... వెలసినవి...
వీణలా.. నెరజాణలా... కల కల.. గల గలా
 
కదలి వచ్చింది కన్నె అప్సరా
ఎదుట నిలిచింది కనుల ముందరా
తేట తేట తెలుగులా... తెల్లవారి వెలుగులా...


2 comments:

మనసు కవి ఆత్రేయగారి డైలాగ్స్..లతా అన్న పిలుపు..కె.వి. మహదేవన్ గారి మ్యూజిక్..సినిమా ప్రియులు యెన్ని వందలసార్లు చూసి వుంటారో ఈ మూవీని..

హహహ అవునండీ :-) థాంక్స్ ఫర్ ద కామెంట్.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.