ఆదివారం, ఆగస్టు 31, 2014

తూనీగా తూనీగా...

ఒక టైమ్ లో తెలుగు సినీ ప్రేక్షకులను మధురమైన సంగీతంలో ఓలలాడించిన ఆర్పీపట్నాయక్ స్వరపరచిన ఒక చక్కని పాట ఇది. నాకు ఇష్టమైన ఈపాట మీరూ చూసీ వినీ ఆనందించండి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.



చిత్రం : మనసంతానువ్వే (2001)
రచన : సిరివెన్నెల
సంగీతం : ఆర్.పి.పట్నాయక్
గానం : సంజీవని, ఉష

తూనీగా తూనీగా 
ఎందాకా పరిగెడతావే 
రావే నా వంకా
దూరంగా పోనీకా 
ఉంటాగ నీ వెనకాలే 
రానీ సాయంగా
ఆ వంక ఈ వంక హొహొ తిరిగావే ఎంచక్కా
ఇంకానా చాలింక ఇంతేగా నీ రెక్క
ఎగిరేనా ఎప్పటికైనా ఆకాశం దాకా
 
తూనీగా తూనీగా 
ఎందాకా పరిగెడతావే 
రావే నా వంకా

దోసిట్లో ఒక్కో చుక్కా పోగేసిఇస్తున్నాగా
వదిలేయకు సీతాకోక చిలకలుగా
వామ్మో బాగుందే చిట్కా నాకు నేర్పిస్తే చక్కా
సూర్యుణ్ణే కరిగిస్తాగా చినుకులుగా
సూర్యుడు ఏడి నీతో ఆడి
చందమామ అయిపోయాడుగా

తూనీగా తూనీగా 
ఎందాకా పరిగెడతావే 
రావే నా వంకా

ఆ కొంగలు ఎగిరి ఎగిరి సాయంత్రం గూటికి మళ్ళి
తిరిగొచ్చే దారిని ఎపుడూ మరిచిపోవెలా
ఓ సారటువైపెళుతుంది మళ్ళీ ఇటు వైపొస్తుంది
ఈరైలుకి సొంతూరేదో గురుతురాదెలా
 
కూ కూ బండి మా ఊరుంది 
ఉండిపోవే మాతో పాటుగా
 
తూనీగా తూనీగా 
ఎందాకా పరిగెడతావే 
రావే నా వంకా
దూరంగా పోనీకా 
ఉంటాగ నీ వెనకాలే 
రానీ సాయంగా 
ఆ వంక ఈ వంక తిరిగావే ఎంచక్కా
ఇంకానా చాలింక ఇంతేగా నీ రెక్క
ఎగిరేనా ఎప్పటికైనా ఆకాశం దాకా


2 comments:

చిన్నప్పటి ఆనందాలు..చిగురించిన మందారాలు అని యెప్పుడో చదువుకున్న కవిత గుర్తొస్తోంది ఈ పాట వింటుంటే..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.