మంగళవారం, ఆగస్టు 05, 2014

పిల్ల గాలి అల్లరి...

ఆడవాళ్ళు అందంగా ఉంటారన్నమాటే నిజమైతే మూడంకెలు లెక్కపెట్టే లోపు వర్షం కురుస్తుందంటూ సరదాగా పందెం కట్టిన మగాళ్ళు ఆశ్చర్యపోయేలా కురిసిన వానని మెచ్చుకుంటూ అమ్మాయిలు ఆనందంతో పాడే ఈపాట నాకు బాగా ఇష్టం. ముఖ్యంగా పల్లవిలో సిరివెన్నెల గారు వర్షాన్ని వర్ణించిన తీరు చాలా బాగుంటుంది. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.



చిత్రం : అతడు (2005)
సంగీతం : మణిశర్మ
సాహిత్యం : సిరివెన్నెల
గానం : శ్రేయా ఘోషల్

పిల్ల గాలి అల్లరి ఒళ్ళంతా గిల్లి
నల్ల మబ్బు ఉరిమేనా
పిల్ల గాలి అల్లరి ఒళ్ళంతా గిల్లి
నల్ల మబ్బు ఉరిమేనా
కళ్ళెర్రజేసి మెరుపై తరిమేనా
యెల్లలన్నీ కరిగీ ఝల్లుమంటూ ఉరికే
మా కళ్ళల్లో వాకిళ్ళల్లో
వేవేల వర్ణాల వయ్యారి జాణ
అందమైన సిరి వాన ముచ్చటగా మెరిసే సమయానా
అందరాని చంద్రుడైనా మా ఇంట్లో బంధువల్లే తిరిగేనా

మౌనాల వెనుకాలా వైనాలు తెలిసేలా
గారంగా పిలిచేనా ఝల్లుమంటు గుండెలోన
తుంటరిగా తుళ్ళుతున్న తిల్లానా
హో...మౌనాల వెనుకాలా వైనాలు తెలిసేలా
గారంగా పిలిచేనా ఝల్లుమంటు గుండెలోన
తుంటరిగా తుళ్ళుతున్న తిల్లానా

ఇంద్రజాలమై వినోదాల సుడిలో కాలాన్ని కరిగించగా
చంద్రజాలమై తరంగాల వడిలో యేళ్ళన్ని మరిపించగా
తారలన్నీ తోరణాలై వారాల ముత్యాల హారాలయ్యేనా
చందనాలు చిలికేనా, ముంగిలిలో నందనాలు విరిసేనా
అందరాని చంద్రుడైనా మా ఇంట్లో బంధువల్లే తిరిగేనా
  
నవ్వుల్లో హాయి రాగం మువ్వల్లో వాయువేగం
యేవైందో ఇంత కాలం ఇంతమంది బృందగానం
ఇవ్వాళే పంపెనేమో ఆహ్వానం
హో...నవ్వుల్లో హాయి రాగం మువ్వల్లో వాయువేగం
యేవైందో ఇంత కాలం ఇంతమంది బృందగానం
ఇవ్వాళే పంపెనేమో ఆహ్వానం 
పాలవెల్లిగా సంతోషాలు చిలికే సరదా సరాగాలుగా
స్వాతి జల్లుగా స్వరాలెన్నో పలికే సరికొత్త రాగాలుగా
నింగిదాకా పొంగిపోదా హోరెత్తి పోతున్న గానాబజానా
ఛెంగుమంటు ఆడేనా చిత్రంగా జావళీలు పాడేనా
అందరాని చంద్రుడైనా మా ఇంట్లో బంధువల్లే తిరిగేనా

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.