శుక్రవారం, ఆగస్టు 15, 2014

చేయెత్తి జైకొట్టు తెలుగోడా...

ఈరోజు శ్రావణ శుక్రవారం సంధర్బంగా ముందుగా ఈ లక్ష్మీ శ్లోకాన్ని దాని తాత్పర్యాన్ని తెలుసుకుందాం. ప్రతిపదార్ధం కొరకు ఇక్కడ ఈ భక్తి బ్లాగ్ లో చూడవచ్చు. ఎంబెడ్ చేసినది సీతారామ కళ్యాణం సినిమాకోసం ఎమ్మెస్ రామారావు గారు గానం చేసిన ఈ శ్లోకం వీడియో. ఆడియో మాత్రమే కావాలంటే ఇక్కడ వినవచ్చు లేదా డౌన్లోడ్ చేస్కోవచ్చు.



చిత్రం : సీతారామ కళ్యాణం (1961)
సంగీతం : గాలిపెంచల నరసింహా రావు 
గానం : ఎమ్మెస్ రామారావు 
 
లక్ష్మీం క్షీర సముద్ర రాజ తనయాం శ్రీరంగ ధామేశ్వరీం
దాసీ భూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం
శ్రీ మన్మంద కటాక్ష లబ్ధ విభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం
త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియామ్ 


తాత్పర్యం: లక్ష్మీ దేవీ! పాల సముద్రపు రాజు కూతురవై, శ్రీరంగధామమునకు అధిపతివై, దాస దాసీ జనులను, సమస్త దేవతా స్త్రీలను, లోకములన్నింటిని ప్రకాశింప జేయు దీప జ్యోతివి నీవు. బ్రహ్మ, ఇంద్రుడు, శివుడు మొదలయిన వారు కూడ శ్రీమంతురాలగు నీ చల్లని చూపులచే వైభవమును పొందిరి. ముల్లోకములు నీ కుటుంబమే. పద్మములో పుట్టిన, విష్ణువుకు ఇష్ట సఖివైన ఓ! లక్ష్మీ దేవీ, నీకు నమస్కారములు.


~*~*~*~*~*~*~*~*~*~

ఈరోజు స్వాతంత్ర దినోత్సవం కదా ఈ సంధర్బంగా తెలుగు వారందరిలోనూ స్ఫూర్తి నింపి తగవులను మాని ఒక్కటిగా తెలుగు జాతి అభ్యుదయానికి పాటుపడమంటూ ప్రోత్సహించే ఈ గీతాన్ని తలచుకుందామా. అలాగే ఈ సంధర్బంగా స్వాతంత్రం వచ్చిన అపురూప క్షణాలకు సంబంధించిన కొన్ని చిత్రాలు ఇక్కడ చూడవచ్చు. ఈ పాట ఆడియో మాత్రమే కావాలంటే ఇక్కడ వినవచ్చు.



చిత్రం : పల్లెటూరు (1952)
సంగీతం : ఘంటసాల 
సాహిత్యం : వేములపల్లి శ్రీకృష్ణ 
గానం : ఘంటసాల 

చేయెత్తి జైకొట్టు తెలుగోడా!
గతమెంతో ఘనకీర్తి గలవోడా!

వీర రక్తపుధార వారఓసిన సీమ
వీర రక్తపుధార వారఓసిన సీమ 

పలనాడు నీదెరా వెలనాడు నీదెరా
పలనాడు నీదెరా వెలనాడు నీదెరా 

బాలచంద్రుడు చూడ ఎవడోయి!
తాండ్ర పాపయ్య గూడ నీవోడోయ్!

నాయకీ నాగమ్మ, మల్లమాంబా, మొల్ల
నాయకీ నాగమ్మ, మల్లమాంబా, మొల్ల 

మగువ మాంచాల నీతోడ బుట్టినవాళ్ళే
మగువ మాంచాల నీతోడ బుట్టినవాళ్ళే

 వీరవనితలగన్న తల్లేరా!
ధీరమాతల జన్మభూమేరా!

కల్లోల గౌతమీ వెల్లువల కృష్ణమ్మ
కల్లోల గౌతమీ వెల్లువల కృష్ణమ్మ

 తుంగభద్రా తల్లి పోంగిపొరలిన చాలు
తుంగభద్రా తల్లి పోంగిపొరలిన చాలు 

ధాన్యరాసులే పండు దేశానా!
కూడు గుడ్డకు కొదువలేదోయీ!

ముక్కోటి బలగమోయ్ ఒక్కటై మనముంటే
ఇరుగు పొరుగులోన వూరు పేరుంటాది
తల్లి ఒక్కతే నీకు తెలుగోడా!
సవతి బిడ్డల పోరు మనకేలా!

పెనుగాలి వీచింది అణగారి పోయింది
పెనుగాలి వీచింది అణగారి పోయింది

 నట్టనడి సంద్రాన నావ నిలుచుండాది
నట్టనడి సంద్రాన నావ నిలుచుండాది 

చుక్కాని బట్టారా తెలుగోడా!
నావ దరిజేర్చరా మొనగాడా!

చేయెత్తి జైకొట్టు తెలుగోడా!
గతమెంతో ఘనకీర్తి గలవోడా!
గతమెంతో ఘనకీర్తి గలవోడా!



"మన బాధ్యతను మనం సక్రమంగా నిర్వర్తించడం కూడా దేశభక్తే... మార్పు మనతోనే మొదలవ్వాలి.." అని తెలియజేస్తూ ఈ స్వాతంత్ర దినోత్సవానికి ఒక చక్కని లఘు చిత్రాన్ని కానుకగా అందించారు అల్లూ అర్జున్ మరియూ సుకుమార్. వారిరువురినీ మరియూ ఈ చిత్రానికి పని చేసిన వారందరినీ హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఈ చిత్రాన్ని మీరూ చూడండి. చూసి ఆలోచించండి...


0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.