నాకు చాలా ఇష్టమైన సినిమాలోని ఒక చక్కని వర్షం పాట ఇది, ఐశ్వర్య పై చిత్రీకరించడం వలన ఈ పాట అందం పదింతలైంది. ఒరిజినల్ తమిళ్ వర్షన్ కవిత "సుబ్రహ్మణ్య భారతి" గారు రాశారుట... తెలుగు అనువాదం ఏ.ఎం.రత్నం శివగణేష్ లదే అని అనుకుంటున్నాను. ఈ పాట క్యాసెట్ తో పాటు విడుదల చేయనందు వలన పాట గురించిన ఖచ్చితమైన వివరాలు అలభ్యం. వీడియో ఇక్కడ ఎంబెడ్ చేశాను చూసి ఆనందించండి. ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా డౌన్లోడ్ చేస్కోవచ్చు.
చిత్రం : ప్రియురాలు పిలిచింది(2000)
సంగీతం : ఏ.ఆర్.రెహ్మాన్
సాహిత్యం : సుబ్రహ్మణ్య భారతి(తమిళ్)
అనువాదం : శివగణేష్ & ఏ.ఎం.రత్నం
గానం : హరిహరన్
వెలిగే నీ కనులే చిట్టెమ్మా
సూర్య చంద్రులే..
నల్లని నీ కనుపాపే చిట్టెమ్మా
వాన మేఘములే..
పట్టుకరి నీలి కోక పొదిగిన వజ్రాలే
నట్టనడి నిశిలో మెరిసే నక్షత్రాలే సఖీ
పూసే మధు మాసం
నీదు సుందర దరహాసం
నీలి కడలి అలలా
నీలి కడలి అలలా
నీదు హృదయం ఆవేశం
ఎల కోయిల గానం
నీదు గాత్రపు మాధుర్యం
బాల కుమారివి చిట్టెమ్మా
బాల కుమారివి చిట్టెమ్మా
మనసు నీకంకితం
శాస్త్రము పలికేవా చిట్టెమ్మా
శాస్త్రము లెందులకే
ఆత్రము కలవారే చిట్టెమ్మా
ఆత్రము కలవారే చిట్టెమ్మా
శాస్త్రము చూసేదీ..
పెద్దల సమ్మతితో పిదప
పెద్దల సమ్మతితో పిదప
పెళ్ళిని జరిపిద్దాం
వేగిపోతున్నా.. ఇదిగో..
వెలిగే నీ కనులే చిట్టెమ్మా
సూర్య చంద్రులే..
నల్లని నీ కనుపాపే చిట్టెమ్మా
వాన మేఘములే..
2 comments:
Nice song... thanks for sharing
థాంక్స్ పద్మార్పిత గారు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.