వైశాలి సినిమా అంటే నాకు ప్రత్యేకమైన ఇష్టం నాకు చాలా ఇష్టమైన వర్షం నీరు తీసుకుని నాకు ఎంతో ఇష్టమైన హార్రర్ జెనర్ లో వచ్చిన సినిమా ఇది. అలాగే సినిమాలో భయపెట్టే సన్నివేశాల చిత్రీకరణ కూడా మరీ జుగుప్సాకరంగా కాకుండా చాలా చక్కగా చిత్రీకరించారు. అందులోని ఓ చక్కని పాట ఈరోజు మీకోసం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేయవచ్చు.
చిత్రం : వైశాలి(2011)
సంగీతం : ఎస్.థమన్
సాహిత్యం : చైతన్యప్రసాద్
గానం : రంజిత్
కనులే కనులే ఏదో తెలిపే ఇది ప్రేమనుకోనా
తడిసే తడిసే మనసే తడిసే
లేరే లేరే ఎవరూ నాకు ఒంటరినే నేను
ఇకపై ఇకపై అన్నీ నువ్వే...
కురిసే కురిసే వానే కురిసే ఇది ప్రేమనుకోనా
ఎదనే ఎదనే తడిపిన వాన
రగిలే రగిలే మనసే రగిలే జ్వర మొచ్చిందేమో
తడిసి తడిసి ప్రేమలోనే
కురిసే కురిసే వానే కురిసే ఇది ప్రేమనుకోనా
ఎదనే ఎదనే తడిపిన వాన
రగిలే రగిలే మనసే రగిలే జ్వర మొచ్చిందేమో
తడిసి తడిసి ప్రేమలోనే
మునుపే నేనే ఒక దీవై ఉన్నానే
సంద్రమై నువ్వే నా చుట్టూ ఉన్నావే
మౌనంగా మౌనంగా అన్నా
వెళిపోతూ వెళిపోతూ ఉన్నా
కురిసే కురిసే...
సె.సె.సె.కురిసే..
నీ ఓణీ తగిలిందా ఒక జల్లే కురిసిందే
ముసిముసి నీ నవ్వుల్లో ఓ వరదగ మారిందే
నుదుటున కదిలే కురులే తామర బిందువువోలే
అది సరిచేసే లోపే ముత్యాలే రాలేనే
చాలులే చాలే.. ఇక నువ్వే వెళ్లిపో
ఊపిరే నాదే ఆగిపోయేలాగుందే
కనులే కనులే ఏదో తెలిపే ఇది ప్రేమనుకోనా
తడిసే తడిసే మనసే తడిసే
లేరే లేరే ఎవరూ నాకు ఒంటరినే నేను
ఇకపై ఇకపై అన్నీ నువ్వే...
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.