శనివారం, ఆగస్టు 16, 2014

టిప్పులు టప్పులు...

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన గోదావరి సినిమా లోని ఒక అందమైన వాన పాట ఇది నాకు చాలా ఇష్టం. రాథాకృష్ణన్ తన శైలికి భిన్నంగా కాస్త వేగంగా ఉన్న ట్యూన్ ఇచ్చినా దానికి వేటూరి గారు రాసిన సాహిత్యం చాలా చక్కగా ఉంటుంది. గోదారి మీద లాంచీల్లో వర్షంలో చిత్రీకరించిన తీరు కూడా నాకు చాలా ఇష్టం. ఈ పాట ఆడియో మాత్రమే కావాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.చిత్రం : గోదావరి (2006)
సంగీతం : కె.యమ్.రాథాకృష్ణన్
సాహిత్యం :  వేటూరి
గానం : శ్రేయ ఘోషల్

టప్పులు టిప్పులు దుప్పటి చిల్లులు
గాలివాన హొరుజల్లులూ
ఏటిలో చేపలు చేతిలో పాపలు
ఛెంగుమన్న నీటి జింకలూ
జిల్లుజిల్లున జల్లు ముద్దులు
చేసిపోయె ముద్దముద్దగా
మబ్బుమబ్బున మెరుపుతీగ పొద్దులూ
కళ్ళలోన కన్నుగీటగా
కానలా మేడలా చినుకుమన్న జాడలా

టప్పులు టిప్పులు దుప్పటి చిల్లులు
గాలివాన హొరుజల్లులు
ఏటిలో చేపలు చేతిలో పాపలు
ఛెంగుమన్న నీటి జింకలు

 
గాలీ వాన తోడై వచ్చి ఉయ్యాలూపగా
వానా రేవు పిన్నా పెద్ద సయ్యటాడగా
గూటిపడవలో గువ్వ జంటలూ
కూత పెట్టు లేత వలపులూ
లంగరేసినా అంది చావని
రంగసాని చాటు పిలుపులు
రాకడో పోకడో రాములోరికెరుకలే

టప్పులు టిప్పులు దుప్పటి చిల్లులు
గాలివాన హొరుజల్లులూ
ఏటిలో చేపలు చేతిలో పాపలు
ఛెంగుమన్న నీటి జింకలూ


ఏరూ నీరు ఓ దారైతే ఎదురీదాలిలే
ఎండా వాన కొండా కోన నీళ్ళాడాలిలే
ఘల్లుఘల్లున సాని కిన్నెరా
గౌతమింట గజ్జెకట్టెలే
ఎంగిలంటని గంగవంటిది
పండు ముసలి శబరి తల్లిలే
ఆడరా పాడరా తోకలేని వానరా

టప్పులు టిప్పులు దుప్పటి చిల్లులు
గాలివాన హొరుజల్లులు
ఏటిలో చేపలు చేతిలో పాపలు
ఛెంగుమన్న నీటి జింకలు
 


జిల్లుజిల్లున జల్లు ముద్దులు
చేసిపోయె ముద్దముద్దగా
మబ్బుమబ్బున మెరుపుతీగ పొద్దులు
కళ్ళలోన కన్నుగీటగా 

కానలా మేడలా చినుకుమన్న జాడలా

టప్పులు టిప్పులు దుప్పటి చిల్లులు
గాలివాన హొరుజల్లులూ
ఏటిలో చేపలు చేతిలో పాపలు
ఛెంగుమన్న నీటి జింకలు


0 comments:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.