సిరివెన్నెల గారు రాసిన అందమైన పాటలలో ఒక చక్కని పాట ఇది, అమ్మాయిని గురించి ఇంత చక్కగా వర్ణించిన పాట మరోటిలేదేమో.. ఆర్తీ పై తీసిన చిత్రీకరణ కూడా నాకు చాలా ఇష్టం మీరు కూడా చూసీ వినీ ఆనందించండి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.
చిత్రం : నీ స్నేహం(2002)
సంగీతం : ఆర్.పి.పట్నాయక్
సాహిత్యం : సిరివెన్నెల
గానం : ఉష, కోరస్
ఆఆఆఅ..ఆఆఆఆ....
చినుకు తడికి చిగురు తొడుగు పువ్వమ్మా
ఎవరి కనుల చిలిపి కలవు నువ్వమ్మా
మువ్వలే మనసుపడు పాదమా
ఊహలే ఉలికిపడు ప్రాయమా
హిందోళంలా సాగే అందాల సెలయేరమ్మా
ఆమని మధువనమా…ఆ…ఆమని మధువనమా
చినుకు తడికి చిగురు తొడుగు పువ్వమ్మా
ఎవరి కనుల చిలిపి కలవు నువ్వమ్మా
మువ్వలే మనసుపడు పాదమా
ఊహలే ఉలికిపడు ప్రాయమా
హిందోళంలా సాగే అందాల సెలయేరమ్మా
ఆమని మధువనమా…ఆ…ఆమని మధువనమా
చినుకు తడికి చిగురు తొడుగు పువ్వమ్మా
ఎవరి కనుల చిలిపి కలవు నువ్వమ్మా
ఎవరి కనుల చిలిపి కలవు నువ్వమ్మా
సరిగస సరిగస రిగమ దని
సరిగస సరిగస నిదమ దని
సస నిని దద మమ గమదనిరిస గ
నినిగగ నినిదద నినిగగ నినిదద
సగమగ సనిదని మదనిస నిసగస గ
పసిడి వేకువలు పండు వెన్నెలలు
పసితనాలు పరువాల వెల్లువలు
కలిపి నిన్ను మలిచాడో ఏమో బ్రహ్మ
పచ్చనైన వరి చేల సంపదలు
అచ్చ తెనుగు మురిపాల సంగతులు
కళ్ల ముందు నిలిపావే ముద్దుగుమ్మా
పాలకడలి కెరటాల వంటి నీ లేత అడుగు
తన ఎదను మీటి నేలమ్మ పొంగెనమ్మా
ఆగని సంబరమా..ఆ…ఆగని సంబరమా….
పసిడి వేకువలు పండు వెన్నెలలు
పసితనాలు పరువాల వెల్లువలు
కలిపి నిన్ను మలిచాడో ఏమో బ్రహ్మ
పచ్చనైన వరి చేల సంపదలు
అచ్చ తెనుగు మురిపాల సంగతులు
కళ్ల ముందు నిలిపావే ముద్దుగుమ్మా
పాలకడలి కెరటాల వంటి నీ లేత అడుగు
తన ఎదను మీటి నేలమ్మ పొంగెనమ్మా
ఆగని సంబరమా..ఆ…ఆగని సంబరమా….
సగమగ రిస సనిదమగ సగ
సగమగ రిస సనిదమగ సగ
సగస మగస గమద నిదమ గమగనిస
సనిస సనిస నిస నిస నిస గమ రిస
సనిస సనిస నిస నిస నిస గమ రిస
గగ నిని గగ నిని దగ నిగ సప
సగస మగస గమద నిదమ గమగనిస
సనిస సనిస నిస నిస నిస గమ రిస
సనిస సనిస నిస నిస నిస గమ రిస
గగ నిని గగ నిని దగ నిగ సప
వరములన్ని నిను వెంటబెట్టుకుని
ఎవరి ఇంట దీపాలు పెట్టమని
అడుగుతున్నవే కుందనాల బొమ్మ
సిరుల రాణి నీ చేయి పట్టి శ్రీహరిగ మారునని రాసిపెట్టి
ఏ వరుని జాతకం వేచి ఉన్నదమ్మా
అన్నమయ్య శృంగార కీర్తనల వర్ణనలకు ఆకారమైన
బంగారు చిలకవమ్మా
కాముని సుమశరమా…ఆ…కాముని సుమశరమా
ఎవరి ఇంట దీపాలు పెట్టమని
అడుగుతున్నవే కుందనాల బొమ్మ
సిరుల రాణి నీ చేయి పట్టి శ్రీహరిగ మారునని రాసిపెట్టి
ఏ వరుని జాతకం వేచి ఉన్నదమ్మా
అన్నమయ్య శృంగార కీర్తనల వర్ణనలకు ఆకారమైన
బంగారు చిలకవమ్మా
కాముని సుమశరమా…ఆ…కాముని సుమశరమా
చినుకు తడికి చిగురు తొడుగు పువ్వమ్మా
ఎవరి కనుల చిలిపి కలవు నువ్వమ్మా
ఎవరి కనుల చిలిపి కలవు నువ్వమ్మా
మువ్వలే మనసుపడు పాదమా
ఊహలే ఉలికిపడు ప్రాయమా
హిందోళంలా సాగే అందాల సెలయేరమ్మా
ఆమని మధువనమా…ఆ…ఆమని మధువనమా
ఊహలే ఉలికిపడు ప్రాయమా
హిందోళంలా సాగే అందాల సెలయేరమ్మా
ఆమని మధువనమా…ఆ…ఆమని మధువనమా
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.