సోమవారం, ఆగస్టు 11, 2014

చినుకు చినుకు అందెలతో...

ఎస్వీ కృష్ణారెడ్డి గారు స్వరపరచిన మంచి పాటలలో ఒకటి ఈ చినుకు చినుకు అందెలతో పాట. దీనిని మొదటగా చిత్రీకరించినది మాయలోడు సినిమా కోసం బాబుమోహన్ సౌందర్య లపై. కానీ శుభలగ్నం సినిమాలో ఆలీ సౌందర్యలపై చిత్రించిన వర్షన్ నాకు ఎక్కువ ఇష్టం. అదే ఇక్కడ ఎంబెడ్ చేస్తున్నాను. నంబర్ వన్ పొజిషన్ లో ఉన్న హీరోయిన్ ని కమెడియన్ తో జతకట్టించి ఇలా వానపాట చిత్రీకరించడం ఎస్వీకృష్ణారెడ్డి గారికే చెల్లిందేమో. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.



చిత్రం : మాయలోడు (1993) / శుభలగ్నం(1994)
సంగీతం : ఎస్. వి. కృష్ణారెడ్డి 
సాహిత్యం : జొన్నవిత్తుల
గానం : బాలు, చిత్ర

చినుకు చినుకు అందెలతో చిటపట చిరు సవ్వడితో
నీలి మబ్బు కురుల ముడిని జార విడిచి వొళ్ళు మరిచి
వాన జాణ ఆడింది వయ్యారంగా
నీళ్ళ పూలు జల్లింది సింగారంగా
 
 
చినుకు చినుకు అందెలతో చిటపట చిరు సవ్వడితో
నీలి మబ్బు కురుల ముడిని జార విడిచి వొళ్ళు మరిచి
వాన జాణ ఆడింది వయ్యారంగా
నీళ్ళ పూలు జల్లింది సింగారంగా


నింగి నేల ఈవేళ చలికి వణికిపోతుంటే
బిగి కౌగిలి పొదరింటికి పద పదమంది
ఈ కౌగిలింతలోన ఏలో
గుండెల్లో ఎండ కాసే ఏలో

 
అరె.. పైన మబ్బు ఉరిమింది
పడుచు జింక బెదిరింది
వలవేయక సెలయేరై పెనవేసింది
అరె..చినుకమ్మ మెరుపమ్మ ఏలో
చిటికేస్తే బుగ్గ మీద ఏలో 

 
తలపు తొలివలపు ఇక తక ఝుం తక ఝుం
వయసు తడి సొగసు అర విరిసె సమయం 

ఆహా…ఊహూ… ఓహోహొహో

చినుకు చినుకు అందెలతో చిటపట చిరు సవ్వడితో
నీలి మబ్బు కురుల ముడిని జార విడిచి వొళ్ళు మరిచి

 వాన జాణ ఆడింది వయ్యారంగా
నీళ్ళ పూలు జల్లింది సింగారంగా

మనసు పట్టు తప్పింది వయసు గుట్టు తడిసింది
ఎద లోపల చలిగాలుల సుడి రేగింది
 

వానొచ్చే వరదొచ్చే ఏలో
వయసంటే తెలిసొచ్చే ఏలో 


మేను చూపు పో అంది వాలు చుపు సై అంది
చెలి కోరిక అలవోకగ తల ఊపింది
 

అరె.. సరసాల సిందులోన ఏలో
సరి గంగ తానాలు ఏలో


ఒడిలో ఇక ఒకటై తక తకతై అంటే 

 సరసానికి దొరసానికి ముడి పెడుతుంటే
ఆహా…ఊహూ… ఓహోహొహో

చినుకు చినుకు అందెలతో చిటపట చిరు సవ్వడితో
నీలి మబ్బు కురుల ముడిని జార విడిచి వొళ్ళు మరిచి
వాన జాణ ఆడింది వయ్యారంగా
నీళ్ళ పూలు జల్లింది సింగారంగా  

 
 చినుకు చినుకు అందెలతో చిటపట చిరు సవ్వడితో
నీలి మబ్బు కురుల ముడిని జార విడిచి వొళ్ళు మరిచి
వాన జాణ ఆడింది వయ్యారంగా
నీళ్ళ పూలు జల్లింది సింగారంగా
  

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.