సోమవారం, ఆగస్టు 25, 2014

వాన మేఘం...

ఈ రోజు శ్రావణ మాసం చివరి రోజు... వాన పాటలకిక శలవు చెప్తూ చివరిగా "డాన్స్ మాస్టర్" సినిమాలోని "వాన మేఘం..." అనే పాటను గుర్తు చేసుకుందామా... ఈ పాట సూతింగ్ మ్యూజిక్ బోలెడంత ఆహ్లాదకరమైన అనుభూతిని మనసొంతం చేస్తే వేటూరి గారి సింపుల్ లిరిక్ అండ్ బాలచందర్ గారి చిత్రీకరణ ఆకట్టుకుంటాయి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. 



చిత్రం : డాన్స్ మాస్టర్ (1986)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : వేటూరి
గానం : చిత్ర

వాన మేఘం మైమరపించే జీవం
దేహమంత మోహం ఏమి మాయ దాహం
మహా సుఖం తడి స్వరం ఇదో రకం చలి జ్వరం
ఫలించెలే స్వయంవరం జ్వలించెలే నరం నరం

నింగే నీలాలు జల్లే కన్నె ప్రేమలో
ప్రేమ యాత్రలో వాన జల్లుగ పూలు రాలిన
మాలి లేడు వాన పూలు ఏరి మాలలల్లగా

వాన మేఘం మైమరపించే జీవం
దేహమంత మోహం ఏమి మాయ దాహం

నింగి నా ముంగిలై నీటి తోరణాలతో హొయ్
వంగి నా పొంగులే వూగే చుంబనాలతో
కన్ను కన్ను కవ్వింతలో తడిపొడి తుళ్ళింతలో
కసికసి రెట్టింతలో అది ఇది అంటింతలో
సయ్యాటాడే ఒయ్యారాలేమో లేత లేతగా
చేతికందగ జాజి తీగలే నీటి వీణలై
మీటుకున్న పాట చినుకులేరి చీర కట్టగా

వాన మేఘం మైమరపించే జీవం
దేహమంత మోహం ఏమి మాయ దాహం
మహా సుఖం తడి స్వరం ఇదో రకం చలి జ్వరం
ఫలించెలే స్వయంవరం జ్వలించెలే నరం నరం

నింగే నీలాలు జల్లే కన్నె ప్రేమలో
ప్రేమ యాత్రలో వాన జల్లుగ పూలు రాలిన
మాలి లేడు వాన పూలు ఏరి మాలలల్లగా

వాన మేఘం మైమరపించే జీవం
దేహమంత మోహం ఏమి మాయ దాహం 


0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.