ఆదివారం, ఆగస్టు 24, 2014

తకిట తధిమి..

సాగర సంగమం సినిమాలోని ఈ పాటకి పరిచయ వాక్యాలు రాయడమంటే సూరీడిని దివిటీ తో చూపించడం లాంటిదే. నాకు చాలా ఇష్టమైన ఈ పాటను మీరూ గుర్తు చేసుకోండి. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.  



చిత్రం : సాగరసంగమం (1983)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : వేటూరి
గానం : ఎస్.పి.బాలు

తకిట తధిమి
తకిట తధిమి తందానా
హృదయ లయల
జతుల గతుల తిల్లానా ॥
తడబడు అడుగుల తప్పని తాళాన
తడిసిన పెదవుల రేగిన రాగాన॥
శ్రుతిని లయని ఒకటి చేసి ॥

నరుడి బ్రతుకు నటన
ఈశ్వరుడి తలపు ఘటన
ఆ రెంటి నట్టనడుమ
నీకెందుకింత త పన ॥
తెలుసా మనసా
నీకిది తెలిసీ అలుసా
తెలిసీ తెలియని
ఆశల వయసీ వరసా ॥
తెలుసా మనసా
నీకిది తెలిసీ అలుసా
తెలిసీ తెలియని
ఆశల లలలా లలలా
ఏటిలోని అలల వంటి కంటిలోని
కలలు కదిపి గుండియలను
అందియలుగ చేసి ॥
తడబడు అడుగుల తప్పని తరిగి
డదోం తరిగిడదోం తరిగిడదోం
తడిసిన పెదవులు రేగిన ఆ ఆ ఆ...
శ్రుతిని లయని ఒకటి చేసి ॥

తకిట తధిమి
తకిట తధిమి తందానా
హృదయ లయల
జతుల గతుల తిల్లానా ॥
తడబడు అడుగుల తప్పని తాళాన
తడిసిన పెదవుల రేగిన రాగాన॥
శ్రుతిని లయని ఒకటి చేసి ॥

పలుకు రాగ మధురం
నీ బ్రతుకు నాట్యశిఖరం
సప్తగిరులుగా వెలిసే
సుస్వరాల గోపురం ॥
అలరులు కురియగనాడెనదే
అలకల కులుకుల అలమేల్మంగా॥
అన్న అన్నమయ్య మాట
అచ్చ తేనె తెనుగుపాట
పల్లవించు పద కవితలు పాడీ...

తకిట తధిమి
తకిట తధిమి తందానా
హృదయ లయల
జతుల గతుల తిల్లానా ॥
తడబడు అడుగుల తప్పని తాళాన
తడిసిన పెదవుల రేగిన రాగాన॥
శ్రుతిని లయని ఒకటి చేసి ॥


0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.