మిత్రుల కోరికపై ఈ శ్రావణమాసంలో పండగలు శుక్రవారాలూ లాంటి ప్రత్యేకమైన రోజులు తప్ప మిగిలిన రోజులన్నీ వానపాటలను తలచుకుందామని నిర్ణయించుకున్నాను. ముందుగా మా నిత్యమీనన్ అండ్ మన నాని నటించిన ఈ పాట నాకు చాలా ఇష్టమైన పాట మీరూ చూసీ వినీ ఆనందించండి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.
చిత్రం : సెగ(2011)
సంగీతం : జాషువా శ్రీధర్
సాహిత్యం : శ్రీమణి
గానం : సుజాన్నె, సునీత
వర్షం ముందుగా మబ్బుల ఘర్షణ
మనసును ముసిరెనే
ఇది మరి ప్రణయమా ప్రళయమా
హృదయం నిండుగా నా ఈ సంఘర్షణ
నన్నే మరిచెనే ఇది బాధో ఏదో
కునుకేమొ దరికి రాదు వణుకేమొ వదిలిపోదు
ఈ వింత పరుగు నాతోన పయనం మాత్రం పూర్తవదు
నా చెంత నువ్వు ఉంటే కాలంకి విలువ లేదు
నువు దూరం ఐపోతుంటే విషమనిపించెను ఈ నిమిషం
వర్షం ముందుగా మబ్బుల ఘర్షణ
మనసును ముసిరెనే ఇది మరి ప్రణయమా ప్రళయమా
హృదయం నిండుగా నా ఈ సంఘర్షణ
నన్నే మరిచెనే ఇది బాధో ఏదో
పసి వయసులొ నాటిన విత్తులు ఓ...
మనకన్నాపెరిగెను ఎత్తులు ఓ...
విరబూసెను పువ్వులు ఇప్పుడు ఓ...
కోసిందెవరప్పటికప్పుడు ఓ...
నువ్వు తోడై ఉన్ననాడు పలకరించే దారులన్నీ
దారులు తప్పుతున్నావే
నా కన్నులు కలలకు కొలనులు ఓ...
కన్నీళ్ళతొ జారెను ఎందుకు ఓ....
నా సంధ్యలు చల్లని గాలులు ఓ...
సుడిగాలిగ మారెను ఎందుకు ఓ...
ఇన్ని నాళ్ళు ఉన్న స్వర్గం నరకం లాగా మారేనే
ఈ చిత్రవధ నీకు ఉండదా
వర్షం ముందుగా మబ్బుల ఘర్షణ
మనసును ముసిరెనే ఇది మరి ప్రణయమా ప్రళయమా
హృదయం నిండుగా నా ఈ సంఘర్షణ
నన్నే మరిచెనే ఇది బాధో ఏదో
కునుకేమొ దరికి రాదు వణుకేమొ వదిలిపోదు
ఈ వింత పరుగు నాతోన పయనం మాత్రం పూర్తవదు
నా చెంత నువ్వు ఉంటే కాలంకి విలువ లేదు
నువు దూరం ఐపోతుంటే విషమనిపించెను ఈ నిమిషం
వర్షం ముందుగా మబ్బుల ఘర్షణ
మనసును ముసిరెనే ఇది మరి ప్రణయమా ప్రళయమా
హృదయం నిండుగా నా ఈ సంఘర్షణ
నన్నే మరిచెనే ఇది బాధో ఏదో
2 comments:
ఈ పాట నాకూ ఇష్టమే ..
బావుంది వేణూ గారు మీ ప్రయత్నం .మీ వాన జల్లుల్లో తడవడానికి మేమూ రెడీ:)
Radhika (nani)
థాంక్స్ రాధిక గారు :-)
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.