శుక్రవారం, ఆగస్టు 01, 2014

ధనమేరా అన్నిటికీ మూలం

ఈ రోజు మొదటి శ్రావణ శుక్రవారం కదా... శ్రావణలక్ష్మిని తమ ఇంటికి ఆహ్వానిస్తూ గృహలక్ష్ములు అందరూ చక్కగా అలంకరించుకుని పూజలు చేస్తుండి ఉంటారు కదా... ఈ సంధర్బంగా ధనము విలువ తెలియజెప్పే ఈ పాటని తలచుకుందామా. మహదేవన్ గారి స్వరం, ఆరుద్ర గారి రచన, ఘంటసాల గారి గళం, ఎస్వీఆర్ గారి అభినయం ఇందరి మేలుకలయికతో ఈ పాటలో చెప్పిన మాటలు సూటిగా ఎదను నాటుకోవూ... మీరూ విని చెప్పండి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.సినిమా : లక్ష్మీనివాసం(1968)
సంగీతం : కె.వి.మహదేవన్
సాహిత్యం : ఆరుద్ర
గానం : ఘంటసాల

ధనమేరా అన్నిటికీ మూలం
ఆ ధనము విలువ తెలుసుకొనుట మానవధర్మం
ధనమేరా అన్నిటికీ మూలం
ఆ ధనము విలువ తెలుసుకొనుట మానవధర్మం
ధనమేరా అన్నిటికీ మూలం

మానవుడే ధనమన్నది సృజియించెనురా
దానికి తానే తెలియని దాసుడాయెరా
మానవుడే ధనమన్నది సృజియించెనురా
దానికి తానే తెలియని దాసుడాయెరా
ధనలక్ష్మిని అదుపులోన పెట్టినవాడే
ధనలక్ష్మిని అదుపులోన పెట్టినవాడే
గుణవంతుడు బలవంతుడు భగవంతుడురా

ధనమేరా అన్నిటికీ మూలం

ఉన్ననాడు తెలివి కలిగి పొదుపు చేయరా
లేనినాడు ఒడలు వంచి కూడబెట్టరా
ఉన్ననాడు తెలివి కలిగి పొదుపు చేయరా
లేనినాడు ఒడలు వంచి కూడబెట్టరా
కొండలైన కరిగిపోవు కూర్చుని తింటే
కొండలైన కరిగిపోవు కూర్చుని తింటే
అయ్యో కూలిపోవు కాపురాలు ఇది తెలియకుంటే

ధనమేరా అన్నిటికీ మూలం

కూలివాని చెమటలో ధనమున్నదిరా
పాలికాపు కండల్లో ధనమున్నదిరా
కూలివాని చెమటలో ధనమున్నదిరా
పాలికాపు కండల్లో ధనమున్నదిరా
శ్రమజీవికి జగమంతా లక్ష్మీనివాసం
శ్రమజీవికి జగమంతా లక్ష్మీనివాసం
ఆ శ్రీదేవిని నిరసించుట తీరని దోషం

ధనమేరా అన్నిటికీ మూలం
ఆ ధనము విలువ తెలుసుకొనుట మానవధర్మం
ధనమేరా అన్నిటికీ మూలం 


2 comments:

ఈ మూవీ కూడా చాలా బావుంటుది..

థాంక్స్ శాంతి గారు.. అవునండీ ఈ సినిమా కూడా బాగుంటుంది.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.