మంగళవారం, ఆగస్టు 26, 2014

నీ నడకల స్టైలదిరే...

సౌతిండియన్ స్టైల్ ఐకాన్ గా అప్పటికే చాలా పాపులర్ అయిన రజనీకాంత్ పాపులారిటీని పదింతలు పెంచేసి తన ఖ్యాతిని ఖండాంతరాలు దాటించిన బిగ్గెస్ట్ మాస్ హిట్ "బాషా". తెలుగు తమిళ్ సినిమాలలో ఒక సరికొత్త ట్రెండ్ కు ఈ సినిమా నాంది పలికింది. అందులో పాటలూ, ప్రతి ఒక్క సీన్ తో సహా అన్నీ పాపులరే... సినిమా వచ్చి ఇరవై ఏళ్ళైనా ఇప్పటికీ మాణిక్యం, మాణిక్ భాషా ల రిఫరెన్స్ అపుడపుడు ఆటోవాలాల దగ్గర వినిపిస్తుంటుంది. ఈ సినిమా నెరేషన్ ని అనుకరిస్తూ తీసిన తీస్తున్న సినిమాలకైతే లెక్కే లేదు. 

ఇందులో పాటలన్నీ కూడా బాగానే హిట్ అయినా వాటిలో ఈ పాట ఒకటి నాకు బాగా నచ్చిన పాట. రజనీ వివిధ గెటప్స్ లో కనిపించి అలరించే ఈపాట చూడడానికి కూడా సరదాగా బాగుంటుంది. మీరూ చూసి విని ఆనందించండి. ఈ పాట ఆడియో మాత్రమే కావాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. 



చిత్రం : భాషా (1995)
సంగీతం : దేవా
సాహిత్యం : వెన్నెలకంటి
గానం : బాలు, చిత్ర

అదిరే.. అదిరే..  
నీ నడకల స్టైలదిరే.. అదిరే 
నీ నవ్వుల కైపదిరే అదిరే 
నీ మాటల తీరదిరే అదిరే 
నీ చూపుకు ఎదఅదిరే  
అదిరే.. అదిరే..
ఓ కన్నె ఎదే దోచుకున్న నీ ఫోజు అదిరే 
ఆ పోజు చూసినాక జారుపైట అదిరే 
అదిరే అదిరే
 
శీఘ్రమేవ గుడ్ బాయ్ ఫ్రెండ్ ప్రాప్తిరస్తు.. 
నీ అల్లరి వయసే నేనొదలను పిల్లా
నన్నల్లుకు పోకా ఇక తప్పదు పిల్లా
కసి కత్తెరలేసే నీ అత్తరు పైట 
చలి ఒత్తిడి కోరే తొలి వలపుల ఆట
మల్లెల లాహిరి మన్మధ చాకిరి అనువుగ కోరినది
తీయని తిమ్మిరి తేనెల చిమ్మిలి అరుదుగ అడిగినది 
ముద్దు పెట్టారాదా హద్దు దాటరాదా.. 

అదిరే.. అదిరే.. 
హాఆ.. నీ నడకల స్టైలదిరే.. అదిరే 
నీ నవ్వుల కైపదిరే అదిరే 
నీ మాటల తీరదిరే అదిరే 
నీ చూపుకు ఎదఅదిరే  
అదిరే.. అదిరే..

నీ చూపులలోనా కసి తుమ్మెదలాడే 
సెగ రేపిన ఈడే బిగి కౌగిలి కోరే
నీ మోహన దాహం నా మోవిని చేరే
ఆ వలపుల మంత్రం చలిచెమ్మలు కోరే 
పెర పెరలాడే పెదవుల రాగం మధువులు కోరెనమ్మ
వయసుకు వయసే వచ్చిన వేళ మనసిక ఆగదమ్మ
పులకరింత నదిలో జలకమాడుదామా

అదిరే.. అదిరే..
ఓ నీ కులుకు నడకదిరే.. అదిరే
నీ మొలక నడుమదిరే అదిరే 
వరదంటీ వయసదిరే అదిరే
పాలుగారు బుగ్గదిరే.. 
అదిరే.. అదిరే.. 
ఓ జాజిపూల మోజు పంచె అందమంత అదిరే 
ఆగలేక రేగుతున్న నీ పరువం అదిరే 
అదిరే అదిరే అదిరే అదిరే


2 comments:

అమితాబ్ హమ్మ్ ఈ మూవీ కి బేస్ అయినా..రజనీ స్టైల్ రజనీదే నండీ..ఈ సాంగ్ కారవాన్ లో పాటకి దగ్గిరగా వుంటుంది..ముఖ్యంగా పల్లవి..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.