బుధవారం, ఆగస్టు 20, 2014

సందెపొద్దు మేఘం...

నాయకుడు సినిమాలోని ఒక చక్కని వానపాట ఈరోజు మీకోసం... మణిరత్నం కమల్ ల ఈ సినిమా నా ఆల్ టైమ్ ఫేవరెట్స్ లో ఒకటి. ఈ పాట చిత్రీకరణ బస్తీవాళ్ళ ఆటపాటలు నాకు చాలా ఇష్టం. మీరూ చూసీ వినీ ఆనందించండి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.



చిత్రం: నాయకుడు (1987)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం : రాజశ్రీ
గానం: బాలు, సుశీల

సందెపొద్దు మేఘం పూల జల్లు కురిసెను నేడూ...
చల్లనైన మనసులు ఆడిపాడుతున్నవి చూడూ...
హోయ్ పలికెను రాగం సరికొత్త గానం
ఈ ఆనందం మా సొంతం

మా సొంతం ఈ ఆనందం నిలవాలి ఇది కలకాలం
 

సందెపొద్దు మేఘం పూల జల్లు కురిసెను నేడూ...
చల్లనైన మనసులు ఆడిపాడుతున్నవి చూడూ...ఆ..ఆ..

 

నీవు నడిచే బాటలోనా లేవు బాధలే.. తనక్కుధిన్
నేను నడిచే బాట మీకూ పూల పాన్పులే.. తనక్కుధిన్
ఒకటంటా ఇక మనమంతా లేదంటా చీకూచింతా 

సాధించాం ఒక రాజ్యాంగం సాగిస్తాం అది మనకోసం
వీసమైన లేదులే బేధ భావమే 

నీకు నాకు ఎన్నడూ నీతి ప్రాణమే
తాం తదిద్ధీం ధీం తధిత్తాం ఆడి పాడుదాం

సందెపొద్దు మేఘం పూల జల్లు కురిసెను నేడూ...
చల్లనైన మనసులు ఆడిపాడుతున్నవి చూడూ...
 

 పలికెను రాగం సరికొత్త గానం
నీ ఆనందం మా సొంతం
మా సొంతం ఈ ఆనందం నిలవాలి ఇది కలకాలం 

 
పాలుతేనెల్లాగ మంచిని పంచు సోదరా.. తనక్కుధిన్
ఆదరించే దైవముంది కళ్ళముందరా.. తనక్కుధిన్
పూవులతో నువు పూజించు కర్పూరాన్ని వెలిగించూ
మమకారాన్ని పండించూ అందరికీ అది అందినూ 

 వాడలోన వేడుకే తుళ్ళి ఆడెనూ
అంతులేని శోభలే చిందులేసెనూ
తాం తదిద్ధీం ధీం తధిత్తాం ఆడి పాడుతాం

సందెపొద్దు మేఘం పూల జల్లు కురిసెను నేడూ...
చల్లనైన మనసులు ఆడిపాడుతున్నవి చూడూ... 

పలికెను రాగం సరికొత్త గానం
ఈ ఆనందం మా సొంతం
మా సొంతం ఈ ఆనందం నిలవాలి ఇది కలకాలం 

 
సందెపొద్దు మేఘం పూల జల్లు కురిసెను నేడూ...
చల్లనైన మనసులు ఆడిపాడుతున్నవి చూడూ...


0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.