గురువారం, సెప్టెంబర్ 17, 2015

వినాయక చవితి శుభాకాంక్షలు..

మిత్రులందరకూ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ సందర్బంగా రాగం చిత్రంకోసం మణిశర్మ సంగీతంలో  బోంబే జయశ్రీ గారు గానం చేసిన ఈ అద్భుతమైన శ్లోకాన్ని తలచుకుందాం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : రాగం (2006)
సంగీతం : మణిశర్మ, అమిత్ హెరి
సాహిత్యం : ముత్తుస్వామీ దిక్షితార్
గానం : బోంబే జయశ్రీ

ఆఆఆఅ..ఆఆఆఆ....
మహా గణపతిం మనసా స్మరామి
మహా గణపతిం మనసా స్మరామి
మహా గణపతిం మనసా స్మరామి
మహా గణపతిం మనసా స్మరామి
ఆఆఆఆఅ...మహా గణపతిం మనసా స్మరామి
వశిష్ట వామ దేవాది వందిత
మహా గణపతిం...


మహా దేవ సుతం గురుగుహ నుతం
మహా దేవ సుతం గురుగుహ నుతం
మార కోటి ప్రకాశం శాంతం
మహా కావ్య నాటకాది ప్రియం
మూషిక వాహన మోదక ప్రియం

ఆఆఆఆఅ...మహా గణపతిం మనసా స్మరామి
వశిష్ట వామ దేవాది వందిత
మహా....

~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~

మణిశర్మ అమిత్ ల ఫ్యూజన్ విన్నారు కదా ఇపుడు 1957 లొ విడుదలైన వినాయక చవితి చిత్రం కోసం ఘంటసాల గారు గానం చేసిన ఈ చక్కని శ్లోకాలు పాట వినండి. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు...చిత్రం : వినాయక చవితి (1957)
సంగీతం : ఘంటసాల
సాహిత్యం : శ్రీ ముత్తుస్వామి దీక్షితార్
గానం : ఘంటసాల

శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే
అగజానన పద్మార్కం గజానన మహర్నిశం
అనేక దం తం భక్తానాం ఏకదంత ముపాస్మహే
ఏకదంత ముపాస్మహే

వాతాపి గణపతిం భజే హం
వాతాపి గణపతిం భజే హం
వాతాపి గణపతిం భజే హం
వారణాస్యం వరప్రదం శ్రీ
వారణాస్యం వరప్రదం శ్రీ

వాతాపి గణపతిం భజే..ఏఏ..

భూతాది సంసేవిత చరణం
భూతభౌతికా ప్రపంచభరణం
వీత రాగిణం వినుత యోగినం
వీత రాగిణం వినుత యోగినం
విశ్వకారణం విఘ్నవారణం

వాతాపి గణపతిం భజే..ఏఏ..

పురా కుంభసంభవ మునివరా   
ప్రపూజితం త్రిభువన మధ్యగతం   
మురారీ ప్రముఖాద్యుపాస్థితం   
మూలాధారా క్షేత్రార్జితం   
పరాది చత్వారి వాగాత్మజం   
ప్రణవ స్వరూప వక్రతుండం   
నిరంతరం నిఖిల చంద్రఖండమ్   
నిజ వామకర విదృతేక్షు దండం   

కరాంబుజపాశ బీజాపూరం
కలుషవిదూరం భూతాకారం
కరాంబుజపాశ బీజాపూరం
కలుషవిదూరం భూతాకారం
హరాది గురుగుహ తోషిత బింబం   
హంసధ్వని భూషిత హేరంబం   

వాతాపి గణపతిం భజే హం
వారణాస్యం వరప్రదం శ్రీ
వాతాపి గణపతిం భజే..ఏఏ..

తొండము నేకదంతమును
తోరపుబొజ్జయు వామహస్తమున్
మెండుగ మ్రోయు గజ్జెలు
మెల్లనిచూపులు మందహాసమున్
కొండొక గుజ్జు రూపము
కోరిన విద్యల కెల్ల నొజ్జవై
ఉండెడి పార్వతీ తనయ
ఓయి గణాధిపా నీకు మ్రొక్కెదన్
గణాధిపా నీకు మ్రొక్కెదన్ ఆఆఆఅ...

2 comments:

ఎపుడూ ఆలస్యంగానే శుభాకాంక్షలందించినా..ఈ సారి మీరా మాటనలేరండీ..ఇవి గణపతి నవరాత్రులుకదా..సో గణపతి నవరాత్రి శుభాకాక్షలు వేణూజీ..

హహహ థాంక్స్ మీక్కూడా వినాయకచవితి శుభాకాంక్షలు శాంతి గారు :-)

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.