శనివారం, సెప్టెంబర్ 26, 2015

చుక్కల తోటలో ఎక్కడున్నావో..

చక్రవర్తి గారి సంగీతంలో వచ్చిన కొన్ని చక్కన్ని మెలోడీస్ లో ఇదీ ఒకటి.. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : అల్లరి బుల్లోడు (1978)
సంగీతం : చక్రవర్తి
సాహిత్యం : వేటూరి
గానం: బాలు, సుశీల

చుక్కల తోటలో ఎక్కడున్నావో
పక్కకు రావే మరుమల్లె పువ్వా

చక్కని జాబిలి ఎక్కడుంటాను
నీ పక్కనే చుక్కనై పలకరిస్తాను

నీలి నీలి నీ కురుల నీలాల మేఘాల
విరిసింది మల్లిక నా రాగ మాలిక
అల్లిబిల్లి నీ కౌగిట అల్లుకున్న నా మమత
కొసరింది కోరిక అనురాగ గీతిక
నీ మూగ చూపులలో...చెలరేగే పిలుపులలో
నీ పట్టు విడుపులలో...సుడి రేగే వలపులలో
కన్ను కన్ను కలవాలి కలసి వెన్నెలై పోవాలి
చీకటి వెన్నెల నీడలలో దాగుడు మూతలు ఆడాలి

చుక్కల తోటలో ఎక్కడున్నావో
పక్కకు రావే మరుమల్లె పువ్వా

చక్కని జాబిలి ఎక్కడుంటాను
నీ పక్కనే చుక్కనై పలకరిస్తాను

ఆకలైన నాకు తెలుసు కౌగిలెంత తీయనిదో..
కౌగిలింతకే తెలుసు ఆకలెంత తీరనిదో
వేచి వున్న నాకు తెలుసు విరహమెంత తీయనిదో..
కాచుకున్న నీకు తెలుసు కలయికెంత కమ్మనిదో
ఈ పూల వానలలో తడిసిన నీ అందాలు
ఆఆ.. ఈ పూట సొగసులలో కురిసిన మకరందాలు
నీలో తీగలు మీటాలి..నాలో రాగం పలకాలి
లోకం మరచిన మైకంలో మనమే ఏకం కావాలి 

చుక్కల తోటలో ఎక్కడున్నావో.. ఆహాహా..
పక్కకు రావే మరుమల్లె పువ్వా

చక్కని జాబిలి ఎక్కడుంటాను..ఆహాహా..
నీ పక్కనే చుక్కనై పలకరిస్తాను



0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.