మిత్రులకు శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. వినాయక చవితి చిత్రం లోని ఈ పాటతో ఆ కన్నయ్యను స్మరించు కుందాం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.
చిత్రం : వినాయకచవితి (1957)
సంగీతం : ఘంటసాల
సాహిత్యం : సముద్రాల రాఘవాచార్య
గానం : సుశీల, బృందం
సలలిత మురళీ గీతమే హరి సంగీతమే
సలలిత మురళీ గీతమే హరి సంగీతమే
కనగ కనగ కడు మురుతు గొలుపు
చిరు నగవుల సొగసుల సన్నుతి తో
సలలిత మురళీ గీతమే హరి సంగీతమే
హరి సంగీతమే హరి
నంద యశోదా నందనా
ఆశ్రిత చందనా రారా
ఇందిరా హృదయ మందిరా
త్రిభువన సుందర
కనరా రారా ఆఆఆఆఅ
ఆఆఆఆ...
గోపాంగనా యవ్వన భాగ్యరాశీ ప్రేమరాశి
కావగ రారా రారా
గోపాల బాల తాండవ లోలా..
గోపాల బాల తాండవ లోలా..
గోపాల బాల తాండవ లోలా..గోపాల బాల
నేడు మా తపసు మా జీవితాశ
చేకూరే మము గూడీ ఆడి పాడరా
గోపాల బాల తాండవ లోలా..గోపాల బాల
గోపాల బాల తాండవ లోలా..గోపాల బాలా..
బృందావన వీధులా శృంగార రేఖ
యమునా తీరముల ఆనంద శోభా
గోపీ భావములా నీ దివ్య లీలా
గోపీ భావములా నీ దివ్య లీలా
చిందేరా మనసారా చిందులేయ రారా
గోపాల బాల తాండవ లోలా..
గోపాల బాల తాండవ లోలా..
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.