మంగళవారం, సెప్టెంబర్ 15, 2015

పేరు చెప్పనా...

ఇళయరాజా గారి సంగీతంలో వచ్చిన ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం.. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. 


చిత్రం : గురు (1980)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : ఆచార్య ఆత్రేయ
గానం : బాలు, జానకి

పేరు చెప్పనా నీ రూపు చెప్పనా
నీ పేరే అనురాగం
నీ రూపము శృంగారము
నీ చిత్తమూ నా భాగ్యము

పేరు తెలుసునూ నీ రూపు తెలుసును
నీ పేరే ఆనందం
నీ రూపము అపురూపము
నీ నేస్తాము నా స్వర్గము
పేరు చెప్పనా నీ రూపు చెప్పనా

పువ్వుల చెలి నవ్వొక సిరి
దివ్వెలేలనే నీ నవ్వు లుండగా
మమతల గని మరునికి సరి
మల్లె లేలారా నీ మమతలుండగా
నీ కళ్ళలో నా కలలనే పండనీ
నీ కలలలో నన్నే నిండనీ
మనకై భువి పై దివి నే దిగనీ

పేరు చెప్పనా నీ రూపు చెప్పనా
పపపపపా పాపపపపా

నీవొక సెల నేనొక అలా
నన్ను వూగనీ నీ గుండె లోపలా
విరి శరముల కురులొక వల
నన్ను చిక్కనీ ఆ చిక్కు లోపలా
నీ మెప్పులు నా సొగసుకే మెరుగులు
ఆ మెరుగులూ వెలగనీ వెలుగులై
మనమే వెలుగు చీకటి జతలూ

పేరు తెలుసునూ నీ రూపు తెలుసును
పపపపపా పాపపపపా

పెదవికి సుధ ప్రేమకు వ్యధా
అసలు అందమూ అవి కొసరు కుందమూ
చెదరని జత చెరగని కథ
రాసుకుందమూ పెన వేసుకుందమూ
నీ హృదయమూ నా వెచ్చనీ ఉదయము
ఈ ఉదయమూ దిన దినం మధురమూ
ఎన్నో యుగముల యోగము మనమూ...

పేరు చెప్పనా నీ రూపు చెప్పనా
పేరు తెలుసునూ నీ రూపు తెలుసును
నీ పేరే అనురాగం
లాలలల లాలలల
లాలలల లాలలల
పపపపపా పాపపపపా

1 comments:

Spiceandhra is a telugu cine portal and provides Telugu Movie Reviews, Telugu Cinema Information,videos, photographs

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.