శనివారం, సెప్టెంబర్ 19, 2015

వయసే ఒక పూలతోట..

మహదేవన్ గారు స్వరపరచిన ఒక హుషారైన ప్రేమ గీతం ఈ రోజు తలచుకుందాం. ఈ పాటలో వయసే అన్న తర్వాత చిన్న పాజ్ ఇచ్చి ట్వింకిల్ లా ఒక చిన్న మ్యూజిక్ బిట్ ఇస్తారు ఆ టచ్ నాకు భలే ఇష్టం, చిన్నపుడు రేడియోలో వింటూ దానికోసం ఎదురు చూసి మరీ ఆనందించేవాడ్ని. ఈ పాట ఆడియో మాత్రం వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : విచిత్ర బంధం (1972)
సంగీతం : కె.వి. మహదేవన్
సాహిత్యం : దాశరథి
గానం : రామకృష్ణ, సుశీల 

వయసే ఒక పూలతోట..
వలపే ఒక పూలబాట
ఆ తోటలో ఆ బాటలో..
పాడాలి తియ్యని పాట..
పాడాలి తియ్యని పాట

వయసే ఒక పూలతోట..
వలపే ఒక పూలబాట
ఆ తోటలో ఆ బాటలో..
పాడాలి తియ్యని పాట..
పాడాలి తియ్యని పాట   

పాల బుగ్గలు ఎరుపైతే హ..
లేత సిగ్గులు ఎదురైతే హహ..
పాల బుగ్గలు ఎరుపైతే హా..
లేత సిగ్గులు ఎదురైతే
రెండు మనసులు ఒకటైతే..
పండు వెన్నెల తోడైతే
రెండు మనసులు ఒకటైతే..
పండు వెన్నెల తోడైతే
కోరికలే తీరేనులే..

పండాలి వలపుల పంట..
పండాలి వలపుల పంట

నీ కంటి కాటుక చీకటిలో.. 
పగలు రేయిగ మారెనులే
నీ కంటి కాటుక చీకటిలో..
పగలు రేయిగ మారెనులే
నీ కొంటెనవ్వుల కాంతులలో..
రేయి పగలైపొయెనులే
నీ కొంటెనవ్వుల కాంతులలో..
రేయి పగలైపొయెనులే
నీ అందము నా కోసమే..

నీ మాట.. ముద్దుల మూట..
నీ మాట.. ముద్దుల మూట

పొంగిపొయే పరువాలు హ.
నింగినంటే కెరటాలు హహ..
పొంగిపొయే పరువాలు హా..
నింగినంటే కెరటాలు
చేరుకున్నవి తీరాలు..
లేవులే ఇక దూరాలు
చేరుకున్నవి తీరాలు..
లేవులే ఇక దూరాలు
ఏనాటికి మన మొక్కటే

ఒక మాట ఇద్దరి నోట..
ఒక మాట ఇద్దరి నోట

వయసే ఒక పూలతోట..
వలపే ఒక పూలబాట..
ఆ తోటలో ఆ బాటలో
పాడాలి తియ్యని పాట..
పాడాలి తియ్యని పాట


2 comments:

సంపెంగ ముక్కు, గులాబీ పెదాలు, కలువల కళ్ళు, బంతి పూల సొగసు..నిజమే వయసే ఒక పూల తోట..

హహహ మీ వర్ణన బాగుందండీ థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతిగారు :-)

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.