సోమవారం, సెప్టెంబర్ 07, 2015

మౌనమే.. ప్రియా ధ్యానమై..

చిన్నికృష్ణుడు సినిమా కోసం ఆర్.డి.బర్మన్ గారి స్వర సారధ్యంలో జానకి గారు గానం చేసిన ఒక మధురగీతాన్ని నేడు తలచుకుందాం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : చిన్ని కృష్ణుడు (1986)
సంగీతం : ఆర్.డి. బర్మన్
సాహిత్యం : వేటూరి
గానం : జానకి

మౌనమే.. ప్రియా ధ్యానమై..
మౌనమే.. ప్రియా ధ్యానమై..
నీలి కన్నులా..ఆ నిలిచీ పిలిచేనా ప్రేమా..ఆ
మౌనమే.. ప్రియా ధ్యానమై..
నీలి కన్నులా..ఆ నిలిచీ పిలిచేనా ప్రేమా..ఆ
 

మౌనమే.. ప్రియా ధ్యానమై..
మౌనమే.. ప్రియా ధ్యానమై..


చెప్పాలంటే నాలో..సిగ్గే శ్రీకారాలు
వెన్నెలలో కాగే తారా.. మందారాలు..ఊ
చెప్పాలంటే నాలో..సిగ్గే శ్రీకారాలు
 వెన్నెలలో కాగే తారా.. మందారాలు..ఊ
పొద్దే తాంబూలాలై..ఎర్రనాలై సంజెలన్నీ..
పల్లవించే ఊహలన్నీ తా ప్రేమ పాటలాయే..
ఈ దూరం..దూరతీరం ముద్దులాడే దెన్నడో..ఓ..ఓ
 
మౌనమే.. ప్రియా ధ్యానమై..
మౌనమే.. ప్రియా ధ్యానమై..

కన్నె చెక్కిళ్ళలో..పండే గోరింటాకు
కన్నులతో రాసే..ప్రేమే లేఖ నీకూ..ఊ
కన్నె చెక్కిళ్లలో..పండే గోరింటాకు
కన్నులతో రాసే..ప్రేమే లేఖ నీకూ..ఊ
వచ్చే మాఘమాసం..పందిరేసే..ముందుగానే..
మీరు నేను పల్లకీలో..ఊరేగే శుభవేళ
నీ చిత్తం నా భాగ్యం..మనువాడే..దెన్నడో..ఓ..ఓ
 
   
మౌనమే.. ప్రియా ధ్యానమై..
మౌనమే.. ప్రియా ధ్యానమై..
నీలి కన్నులా.. నిలిచీ.. పిలిచేనా ప్రేమా..ఆ
మౌనమే.. ప్రియా ధ్యానమై..
మౌనమే.. ప్రియా ధ్యానమై..ఈ..ఈ


0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.