గురువారం, సెప్టెంబర్ 03, 2015

ముక్కుపై ముద్దు పెట్టు..

కె.ఎమ్.రాధకృష్ణ సంగీత సారధ్యంలో వచ్చిన ఒక అందమైన పాట ఈ రోజు తలచుకుందాం. కృష్ణవంశీ మార్క్ చిత్రీకరణతో ఈపాట యువతరం గుండెల్లో గుబులు పుట్టించేస్తుంది. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : చందమామ (2007)
సాహిత్యం : సాయి శ్రీహర్ష
సంగీతం : కె.ఎం. రాధాకృష్ణన్
గానం : హరిచరణ్, సుజాత

ముక్కుపై ముద్దు పెట్టు ముక్కెరై పోయేట్టు
చెంపపై ముద్దు పెట్టు చెక్కరై పోయేట్టు
మీసంపై ముద్దు పెట్టు మీదికే దూకేట్టు
గడ్డంపై ముద్దు పెట్టు గుండెనే తాకేట్టు


మొదట నుదిటి మీద ఒక్క బొట్టు ముద్దు
ఆ పిదప చెవికి చిన్న బుట్ట ముద్దు
 
మత్తు మెడకు ఒక్క మొక్కజొన్న ముద్దు
గమ్మత్తు గొంతుకొక్క సన్నజాజి ముద్దు
బుగ్గ పండు కోరికేసే రౌడీ ముద్దు
కొంటె ఈడు కాజేసే కేడి ముద్దు

కంత్రి ముద్దు జగజ్జంత్రి ముద్దు
కంత్రి ముద్దు జగజ్జంత్రి ముద్దు
ముద్దు ముద్దు ముద్దు ముద్దు ముద్దు ఆ ఆ ఆ 

ముక్కుపై ముద్దు పెట్టు...

వగల నడుము మడత మీద వడ్డాణం ముద్దు
ఈ నాభి చుట్టూ వేడి సెగల సిగ్గాణం ముద్దు
ఓంటి వన్నె చిన్నె విన్నపాల ముద్దు
పువ్వంటి కన్నెకొక్క జున్నుపాల ముద్దు

అల్లరాణి వల్ల కానిగా అల్లరి ముద్దు
అల్లసాని పద్య మంత ఆ అల్లిక ముద్దు
ఆవకాయ్ ముద్దు ఆది ఆంధ్రా ముద్దు
ఆవకాయ్ ముద్దు ఆది ఆం
ధ్రా ముద్దు
ముద్దు ముద్దు ముద్దు ముద్దు ముద్దు ఆ ఆ ఆ

ముక్కుపై ముద్దు పెట్టు మీదికే దూకేట్టు
చెంపపై ముద్దు పెట్టు గుండెనే తాకేట్టు ఆ ఆ ఆ
ముక్కుపై ముద్దు పెట్టు..


1 comments:

అమ్మాయి అడిగితే తప్ప యెక్కడ ముద్దు పెట్టాలో తెలీనట్టున్నాడు కుర్రాడు!
కంగారుపడి పెట్టగూడని చోత ముద్దు పెడితే ఇంకేమన్నా ఉందా,ఖర్మ ఖర్మ?

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.