సత్యం సంగీత సారధ్యంలో సింపుల్ అండ్ స్వీట్ అనదగ్గ ఒక చక్కని మెలోడీ ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.
చిత్రం : ఎదురీత (1977)
సంగీతం : సత్యం
సాహిత్యం : వేటూరి
గానం : బాలు. పి.సుశీల
తొలిసారి ముద్దివ్వమందీ ..
చెలిబుగ్గ చేమంతి మొగ్గా
ఓ..ఓ..తొలిసారి ముద్దివ్వమందీ..
చెలిబుగ్గ చేమంతి మొగ్గా.
పెదవులలో మధువులనే కోరి కోరి చేరి
ఒకసారి రుచి చూడమందీ
చిరుకాటు ఈ తేనెటీగా
నీ పైటతీసి కప్పుకుంది ఆకాశం..
తెరచాటు సొగసులారబోసి నాకోసం..
నీ పైటతీసి కప్పుకుంది ఆకాశం..
తెరచాటు సొగసులారబోసి నాకోసం
నీ చూపులు సోకి... సొగసు వెల్లువలాయే..
నీ చూపులు సోకి... సొగసు వెల్లువలాయే..
నీ ఊపిరి సోకి మనసు వేణువులూదే..
తొలిసారి ముద్దివ్వమందీ ..
చెలిబుగ్గ చేమంతి మొగ్గా
నీ మనసు విప్పి చెప్పమంది మధుమాసం..
సిరిమల్లెపూలు గుప్పుమంది నీకోసం..
నీ మనసు విప్పి చెప్పమంది మధుమాసం..
సిరిమల్లెపూలు గుప్పుమంది నీకోసం..
నీ నవ్వులలోనే... వలపు గువ్వలు సాగే..
నీ నవ్వులలోనే... వలపు గువ్వలు సాగే..
నీ నడకలలోనే వయసు మువ్వలు మోగే..
ఒకసారి రుచి చూడమందీ
చిరుకాటు ఈ తేనెటీగా
ఈ రేయి హాయి మోయలేను ఒంటరిగా..
ఇక రేపు మాపు తీపివలపు పంటలుగా..
ఈ రేయి హాయి మోయలేను ఒంటరిగా..
ఇక రేపు మాపు తీపివలపు పంటలుగా
నులివెచ్చన కాదా.. మనసిచ్చిన రేయి..
నులివెచ్చన కాదా.. మనసిచ్చిన రేయి..
తొలిమచ్చికలోనే సగమిచ్చిన హాయీ...
తొలిసారి ముద్దివ్వమందీ ..
చెలిబుగ్గ చేమంతి మొగ్గా
పెదవులలో మధువులనే కోరి కోరి చేరి
ఒకసారి రుచి చూడమందీ
చిరుకాటు ఈ తేనెటీగా
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.