రామకృష్ణ గారు సుశీలమ్మ పాడిన ఒక మంచి మెలోడీ ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.
చిత్రం : మహాత్ముడు (1976)
సంగీతం : టి.చలపతిరావు
సాహిత్యం : సినారె
గానం : రామకృష్ణ, సుశీల
ఎదురుగా నీవుంటే ఎన్నెన్ని రాగాలో
చల్లని నీ మదిలో ఏ శ్రావణ మేఘాలో
ఎదురుగా నీవుంటే
నీవాలు కన్నులలోన నీలాల రాగాలెన్నో
నీవాలు కన్నులలోన నీలాల రాగాలెన్నో
నీ చిగురు మోవిపైన సిరికెంపుల రాగాలెన్నో
నీ చిగురు మోవిపైన సిరికెంపుల రాగాలెన్నో
నిత్యవసంతుడు నీడగవుంటే..
నిత్యవసంతుడు నీడగవుంటే..
చిత్రవర్ణ రాగాలెన్నో
ఎదురుగా నీవుంటే ఎన్నెన్ని రాగాలో
చల్లని నీ మదిలో ఏ శ్రావణ మేఘాలో
ఎదురుగా నీవుంటే
కమల రమణి విరబూయునులే అరుణోదయ వేళలో
కలువ చెలువ తెరతీయునులే చంద్రోదయ వేళలో
కమల రమణి విరబూయునులే అరుణోదయ వేళలో
కలువ చెలువ తెరతీయునులే చంద్రోదయ వేళలో
వలచిన హృదయం పులకించునులే..
వలచిన హృదయం పులకించునులే..
చెలి వలపుల జోలలో
ఎదురుగా నీవుంటే ఎన్నెన్ని రాగాలో
చల్లని నీ మదిలో ఏ శ్రావణ మేఘాలో..
ఎదురుగా నీవుంటే
మనసైన పందిరి కోసం మరుమల్లె తీగసాగె
మనసైన పందిరి కోసం మరుమల్లె తీగసాగె
సెలయేటి కలయిక కోసం కడలిరేడు తానెదురేగె
సెలయేటి కలయిక కోసం కడలిరేడు తానెదురేగె
ఆ అల్లికలో ఆ కలయికలో
ఆ అల్లికలో ఆ కలయికలో..
అనురాగ వీణ మ్రోగె
ఎదురుగా నీవుంటే ఎన్నెన్ని రాగాలో
చల్లని నీ మదిలో ఏ శ్రావణ మేఘాలో
ఎదురుగా నీవుంటే
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.