గురువారం, సెప్టెంబర్ 24, 2015

సిరిమల్లీ శుభలేఖా...

జంధ్యాల గారు తన చిత్రాలలోని పాటలకు ఎంత ప్రాముఖ్యతనిస్తారో తెలియనిది కాదు హాస్య చిత్రాలే కదా అని ఆయన పాటలను ఎప్పుడూ అలుసుగా తీస్కోలేదు. చూపులుకలిసిన శుభవేళ చిత్రంలోని ఈ పాట కూడా వారి ఉత్తమాభిరుచికి అద్దం పడుతుంది. హీరో సైకిల్ షాప్ ఓనర్ కనుక సైకిల్ థీమ్ తో సింపుల్ గా అందంగా ఈ పాటను చిత్రీకరించిన విధానాన్ని భళా అని మెచ్చుకోకుండా ఉండలేం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : చూపులు కలసిన శుభవేళ (1988)
సంగీతం : రాజన్-నాగేంద్ర
సాహిత్యం : ?? (సినారె,మల్లెమాల, 
జొన్నవిత్తుల, ముళ్ళపూడి శాస్త్రి)
గానం : బాలు, జానకి

సిరిమల్లీ శుభలేఖా చదివావా నెలవంక
తియ్యని పిలుపే శ్రావణ గీతం
అందిన వలపే ఆమని గానం

అక్షర లక్షా  ముద్దుల బిక్ష
కందిన మొగ్గా  కమ్మని బుగ్గా
చిరునవ్వే శుభలేఖ చదివావా శశిరేఖ

జాజిమల్లి తీగనై జూకామల్లి పువ్వునై
నీ చెంత చేరేనులే

ఋతు పవనాలలో రస కవనాలతో
తీర్చాలి నా మోజులే
రాజీ లేని అల్లరి రోజాపూల పల్లవి
నీ పాట కావాలిలే

కధ రమణీయమై చిరస్మరణీయమై
సాగాలి సంగీతమై అనురాగ శ్రీగందమై

చిరునవ్వే శుభలేఖ చదివావా శశిరేఖ
అక్షర లక్షా  ముద్దుల బిక్ష
కందిన మొగ్గా  కమ్మని బుగ్గా

తియ్యని పిలుపే శ్రావణ గీతం
అందిన వలపే ఆమని గానం
సిరిమల్లీ శుభలేఖా చదివావా నెలవంక


రాగాలన్ని నవ్వులై రావాలంట మువ్వవై
నా ప్రేమ మందారమై
తగు అధికారము తమ సహకారమూ
కావాలి చేయూతగా

బుగ్గ బుగ్గ ఏకమై ముద్దే మనకు లోకమై
నూరేళ్ళు సాగాలిలే
ఇది మధుమాసమై మనకనుకూలమై
జరగాలి సుముహుర్తమే కళ్యాణ వైభోగమే

సిరిమల్లీ శుభలేఖా చదివావా నెలవంక
తియ్యని పిలుపే శ్రావణ గీతం
అందిన వలపే ఆమని గానం

లాలాలా ఆహాహాహా..లాలాలా ఆహాహాహ

0 comments:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.