రమేశ్ నాయుడి గారి స్వరసారధ్యంలో వచ్చిన ఒక అందమైన మెలోడీ ఈ రోజు విందాం.. ఎప్పుడు విన్నా ఎంతో హాయైన అనుభూతిని ఇచ్చే ఈ పాట నాకు చాల ఇష్టం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.
చిత్రం : చదువు సంస్కారం (1974)
సంగీతం : రమేశ్ నాయుడు
సాహిత్యం : సినారె
గానం : సుశీల
ఉమ్.. ఊఁ.. ఆ.. ఆ..
దీపానికి కిరణం ఆభరణం..
రూపానికి హృదయం ఆభరణం
హృదయానికి.. ఏనాటికీ..
తరగని సుగుణం.. ఆభరణం
తరగని సుగుణం.. ఆభరణం
దీపానికి కిరణం ఆభరణం..
రూపానికి హృదయం ఆభరణం
నిండుగ పారే యేరు..
తన నీటిని తానే తాగదు
జగతిని చూపే కన్ను..
తన ఉనికిని తానే చూడదు
పరుల కోసం.. బ్రతికే మనిషి..
పరుల కోసం బ్రతికే మనిషి..
తన బాగు తానే కోరడు..
తన బాగు తానే కోరడు..
దీపానికి కిరణం ఆభరణం..
రూపానికి హృదయం ఆభరణం
తాజమహలులో కురిసే వెన్నెల..
పూరి గుడిసెపై కురియదా
బృందావనిలో విరిసే మల్లియ..
పేద ముంగిట విరియదా
మంచితనము పంచేవారికి..
మంచితనము పంచేవారికి..
అంతరాలతో పని ఉందా..
అంతరాలతో పని ఉందా..
దీపానికి కిరణం ఆభరణం..
రూపానికి హృదయం ఆభరణం
వెలుగున ఉన్నంత వరకే..
నీ నీడ తోడుగా ఉంటుంది
చీకటిలో నీవు సాగితే..
అది నీకు దూరమవుతుంది
ఈ పరమార్థం తెలిసిన నాడే..
ఈ పరమార్థం తెలిసిన నాడే..
బ్రతుకు సార్థకమౌతుంది..
బ్రతుకు సార్థకమౌతుంది..
దీపానికి కిరణం ఆభరణం..
రూపానికి హృదయం ఆభరణం
హృదయానికి.. ఏనాటికీ..
తరగని సుగుణం.. ఆభరణం
తరగని సుగుణం.. ఆభరణం
2 comments:
అమ్మాయిలని మనసుతో అర్ధం చెసుకునే రోజెన్నడో..
థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.