శనివారం, సెప్టెంబర్ 12, 2015

నేడే తెలిసింది..

ఆరాధన చిత్రం కోసం రఫీ గానం చేసిన ఒక మధురమైన పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : ఆరాధన (1976)
సంగీతం : ఎస్. హనుమంతరావు
సాహిత్యం : సినారె
గానం : మహమ్మద్ రఫీ, జానకి

నేడే ..తెలిసింది.. ఈనాడే తెలిసింది

నేడే తెలిసింది.. ఈనాడే తెలిసింది
కమ్మని కలకే రూపం వస్తే...ఏ...
కమ్మని కలకే రూపం వస్తే ..
అది నీలాగే ఉంటుందనీ
నేడే తెలిసింది.. ఈనాడే తెలిసింది

నేడే తెలిసింది.. ఈనాడే తెలిసింది
నేడే తెలిసింది.. ఈనాడే తెలిసింది
తీయని పాటకు ప్రాణం వస్తే ...ఏ...
తీయని పాటకు ప్రాణం వస్తే ..
అది నీలాగే ఉంటుందనీ
నేడే తెలిసింది.. ఈనాడే తెలిసింది

ఇంత మంచి రూపానికి .. అంత మంచి మనసుంటుందని
ఇంత మంచి రూపానికి .. అంత మంచి మనసుంటుందని
ఆ మనసున అంతరాలకు తావన్నది లేనే లేదని
ఆ మనసున అంతరాలకు తావన్నది లేనే లేదని
అది వలచే దొకసారే ననీ ...ఆ వలపే విడిపో లేనిదనీ
 
నేడే తెలిసింది.. ఈనాడే తెలిసింది...

ఆఁ......ఆ...ఆ...ఆ....ఆ..ఆ...
ఆఁ......ఆ...ఆ...ఆ....ఆ..ఆ...

మారుమూల పల్లెలోన ..మధుర గానముదయించేనని
మారుమూల పల్లెలోన ..మధుర గానముదయించేనని
శిలలకైన ఆ గానం... పులకింతలు కలిగించేననీ
శిలలకైన ఆ గానం ...పులకింతలు కలిగించేననీ
అది జతగా నను చేరాలని ..నా బ్రతుకే శృతి చేయాలని

నేడే తెలిసింది.. ఈనాడే తెలిసింది
కమ్మని కలకే రూపం వస్తే .. అది నీలాగే ఉంటుందనీ
నేడే తెలిసింది.. ఈనాడే తెలిసింది ...
ఆఆ..తీయని పాటకు ప్రాణం వస్తే .. అది నీలాగే ఉంటుందనీ
నేడే తెలిసింది.. ఈనాడే తెలిసింది...
నేడే తెలిసింది.. ఈనాడే తెలిసింది..


0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.