మంగళవారం, సెప్టెంబర్ 08, 2015

ఓ.. హంసభలే రామచిలక..

సత్యం గారి స్వర సారధ్యంలో వచ్చిన ఒక హుషారైన పాట ఈ రొజు విందాం.. నేను ఎనభైలలో రేడియోలొ తెగ విన్న పాటలలొ ఇదీ ఒకటి. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : ఏజెంట్ గోపి (1978)
సంగీతం : సత్యం
గీ తరచయిత : ఆరుద్ర
నేపధ్య గానం : బాలు, సుశీల, బృందం
 
రరరురరుర రురరుర రురరుర
రరరురరుర రురరుర రురరుర

 
ఓ.. హంసభలే రామచిలక ఓలమ్మీ..
తుర్రుమని ఉడాయించావే...
తుర్రుమని ఉడాయించావే

ఓ.. హంసభలే రామచిలక ఓరబ్బి..
తుర్రుమని ఉడాయించారా...
తుర్రుమని ఉడాయించారా...

 
అల్లో మల్లో.. రాముల వల్లో..
ఝల్లో ఝల్లో.. గుండెల ఝల్లో..
అల్లో మల్లో.. రాముల వల్లో..
ఝల్లో ఝల్లో.. గుండెల ఝల్లో..


ఓ...పదహారేళ్ళ పిల్ల.. నువ్వు పలకానంటే ఎల్ల?
నీకు నాకు డిల్లా.. పెట్టకు పెట్టకు మళ్ళా ..
పదహారేళ్ళ పిల్ల.. నువ్వు పలకానంటే ఎల్ల?
నీకు నాకు డిల్లా.. పెట్టకు పెట్టకు మళ్ళా
ఆశపెట్టి మోసగించే వేషాలెందుకు అందాకల్ల?
 
ఓ.. హంసభలే రామచిలక ఓలమ్మీ
తుర్రుమని ఉడాయించావే..
తుర్రుమని ఉడాయించావే

అల్లో మల్లో.. రాముల వల్లో...
ఝల్లో ఝల్లో... గుండెల ఝల్లో..

 
చింత తోపులో ఉంట.. నువ్వు రాకా పోతే తంట
నన్ను చూడు నీ కడగంట.. పండించు వలపుల పంట
నే చింత తోపులో ఉంట.. నువ్వు రాక పోతే తంట
నన్ను చూడు నీ కడగంట.. పండించు వలపుల పంట
 
ఈడు జోడు బాగా కుదిరే.. నీది నాదే చక్కని జంట

ఓ.. హంస భలే రామ చిలక ఓరబ్బీ
తుర్రుమని ఉడాయించారా..ఆ..
తుర్రుమని ఉడాయించారా


ఓ.. హంసభలే రామచిలక ఓలమ్మీ
తుర్రుమని ఉడాయించవే..
తుర్రుమని ఉడాయించావే

అల్లో మల్లో.. రాముల వల్లో
ఝల్లో ఝల్లో... గుండెల ఝల్లో
అల్లో మల్లో.. రాముల వల్లో
ఝల్లో ఝల్లో... గుండెల ఝల్లో
అల్లో మల్లో.. రాముల వల్లో
ఝల్లో ఝల్లో... గుండెల ఝల్లో 



0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.