సోమవారం, సెప్టెంబర్ 03, 2018

కన్నా నిదురించరా...

ఈ రోజు వైష్ణవ జన్మాష్టమి కనుక ఈ రోజు కూడా కన్నయ్య పాటను తలచుకుందాం. బాహుబలి చిత్రంలోని ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : బాహుబలి ది కంక్లూజన్ (2017)
సంగీతం : ఎమ్.ఎమ్.కీరవాణి
సాహిత్యం : కీరవాణి
గానం : శ్రీనిధి, వి. శ్రీసౌమ్య

మురిపాల ముకుందా...
సరదాల సనందా...
మురిపాల ముకుందా - సరదాల సనందా
మురిపాల ముకుందా - సరదాల సనందా
పొద పొద లోన దాగుడు ముతలాపరా
ఎద ఎద లోన నర్తించింది చాలురా
అలసట నిను కోరి నిలుచుందిరా

కన్నా నిదురించరా
నా కన్నా నిదురించరా
చిటెకెన వేలిని కొండని మోసిన
కన్నా నిదురించరా
నా కన్నా నిదురించరా
చిలికిన చల్లల కుండలు దోచిన
కన్నా నిదురించరా
నా కన్నా నిదురించరా
కన్నా నిదురించరా
నా కన్నా నిదురించరా


గోపెల వలువలతో చెలగి అలసేవేమో
గోముగ శయనించు
ఉంగిలి వెన్నలకై ఉరికే ఉబలాటముకే
ఊరట కలిగించు
శ్యామనా... నా మోహన
చాలు చాలు నీ అట మటలు
పవళించక తీరవు అలసటలు
విరిసే మదిలో విరిశయ్యలు

కన్నా నిదురించరా
నా కన్నా నిదురించరా
కన్నా నిదురించరా
నా కన్నా నిదురించరా


నెర నెర చూపులకే కరిగి కదిలి
నీకై బిర బిర వచ్చితినే
తడి తడి కన్నులతో నీపై వాలి సోలి
తమకము తెలిపితినే
మాధవా... యాదవా...
నా మతి మాలి దోసము జరిగే
ఓ వనమాలి ఎద్దు నిన్ను పొడిచే
పాపం అంతా నాదేనురా...

కన్నా నిదురించరా
నా కన్నా నిదురించరా
కన్నా నిదురించరా
నా కన్నా నిదురించరా


మురిపాల ముకుందా సరదాల సనందా
మురిపాల ముకుందా సరదాల సనందా
మధనా మధుసూధన మనోహర మన్మోహన
మధనా మధుసూధన మనోహర మన్మోహన
మురిపాల ముకుందా సరదాల సనందా
కన్నా... కన్నా... కన్నా..
ఆనందా... అనిరుద్దా...
ఆనందా... అనిరుద్దా...
మురిపాల ముకుందా సరదాల సనందా

కన్నా... రాధా రమణ
కన్నా... నిదురించరా 


6 comments:

వేణు గాన లోలుని ముగ్ధమనోహర రూపం చూసిన చాలు కదా కన్నుల్లో కోటి కాంతులు ప్రకాశిస్థాయి.
మీకు జన్మాష్టమి శుభాకాంక్షలండీ..

అందమైన దృశ్యకావ్యం ఈ పాట..

అవును శాంతి గారు చిత్రీకరణ చాలా బావుంటుంది.. థాంక్స్ ఫర్ ద కామెంట్..

థాంక్స్ రాజ్యలక్ష్మి గారు.. మీకు కూడా జన్మాష్టమి శుభాకాంక్షలు..

అదుర్స్ ! ఆధునిక సినిమా పరిశ్రమలో ఇంతటి అధ్పుతాని ఎవరూ ఆవిష్కరించలేరు

థాంక్స్ ఫర్ ద కామెంట్ అజ్ఞాత గారు..

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.