ఆహ్వానం చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడీయో ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : ఆహ్వానం (1997)
సంగీతం : ఎస్.వి.కృష్ణారెడ్డి
సాహిత్యం : సిరివెన్నెల
గానం : బాలు, చిత్ర
దేవతలారా రండి మీ దీవెనలందించండి
నోచిన నోములు పండించే నా తోడుని పంపించండి
కలలో ఇలలో ఏ కన్నెకి
ఇలాంటి పతిరాడనిపించే వరుణ్ణే వరముగ ఇవ్వండి
కనీవిని ఎరుగని వేడుకతో వివాహం జరిపించాలండి
కలలో ఇలలో ఏ కన్నెకి
ఇలాంటి పతిరాడనిపించే వరుణ్ణే వరముగ ఇవ్వండి
కనీవిని ఎరుగని వేడుకతో వివాహం జరిపించాలండి
శివపార్వతులేమో ఈ దంపతులనిపించాలి
ప్రతి సంసారంలోనూ మా కథలే వినిపించాలి
ఆ సిరిని శ్రీహరిని మా జతలో చూపించాలి
శ్రీకాంతుల కొలువంటే మా కాపురమనిపించాలి
మా ముంగిలిలోన పున్నమిపూల వెన్నెల విరియాలి
మా చక్కని జంట చుక్కలతోట పరిపాలించాలి
కలలో ఇలలో ఏ కన్నెకి
ఇలాంటి పతిరాడనిపించే వరుణ్ణే వరముగ ఇవ్వండి
కనీవిని ఎరుగని వేడుకతో వివాహం జరిపించాలండి
తన ఎదపై రతనంలా నిను నిలిపే మొగుడొస్తాడు
నీ వగలే నగలంటూ గారాలే కురిపిస్తాడు
తన ఇంటికి కళతెచ్చే మహలక్ష్మిగ పూజిస్తాడు
తన కంటికి వెలుగిచ్చే మణిదీపం నీవంటాడు
ఈ పుత్తడిబొమ్మ మెత్తని పాదం మోపిన ప్రతిచోటా
నిధినిక్షేపాలే నిద్దురలేచి ఎదురొచ్చేనంటా
కలలో ఇలలో ఏ కన్నెకి
ఇలాంటి పతి రాడనిపించే వరుణ్ణే వరముగ ఇవ్వండి

4 comments:
పెళ్ళిపిక్స్ అన్నీ చాలా బావున్నాయండీ..నైస్ సాంగ్.
థాంక్స్ శాంతి గారు..
రమ్య కృష్ణ కి కూడా నటన వచ్చని ఈ మూవీ చూశాకే అర్థమైంది.పాట బావుంది.
హహహహహ థాంక్స్ ఫర్ ద కామెంట్ రాజ్యలక్ష్మి గారు..
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.