శనివారం, సెప్టెంబర్ 22, 2018

పందిట్లో పెళ్ళవుతున్నది...

ప్రేమలేఖలు చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : ప్రేమలేఖలు (1953)
సంగీతం : శంకర్ - జైకిషన్ 
సాహిత్యం : ఆరుద్ర
గానం : జిక్కి

పందిట్లో పెళ్ళవుతున్నది
పందిట్లో పెళ్ళవుతున్నది కనువిందౌతున్నది
నటనమే ఆడెదను ఓ నటనమే ఆడెదను 
 
పందిట్లో పెళ్ళవుతున్నది కనువిందౌతున్నది
నటనమే ఆడెదను ఓ నటనమే ఆడెదను
పందిట్లో పెళ్ళవుతున్నది

పెళ్ళికుమార్తెకు పూజాఫలమూ
చేతికందేనూ చేతికందేనూ
గోరింటాకు కోయగ పోతే
గోళ్ళు కందేనూ నా గోళ్ళు కందేనూ
కోరికలు తీరుచున్నవి అవి పేరుచున్నవి

నటనమే ఆడెదనూ ఓ నటనమే ఆడెదనూ
పందిట్లో పెళ్ళవుతున్నదీ

వధువు వరుడు పల్లకిలోన పరదేశమేగెదరు
ఆఆఅ.. వధువు వరుడు పల్లకిలోన పరదేశమేగెదరు
వారిని తలచి బంధువులంతా సతతము వగచెదరూ
సతతము వగచెదరు..
కన్నీరే కురియుచున్నది మది తరుగుచున్నది 
ఒంటరిగా ఆడెదనూ ఓ ఒంటరిగా ఆడెదనూ

పందిట్లో పెళ్ళవుతున్నది కనువిందౌతున్నది
ఒంటరిగా ఆడెదను ఓ ఒంటరిగా ఆడెదను
పందిట్లో పెళ్ళవుతున్నది


8 comments:

వారిని తలచి బంధువులంతా కటకము వగచెదరు ఉ ఉ
కటకము వగచెదరు కన్నీరే కురియుచున్నది
-------------
కటకము కాదు సతతము అనుకుంటాను.

థాంక్స్ రామకృష్ణారావు గారు.. అవునండీ.. పోస్ట్ లో సరి చేశాను..

gOrenTaaku kOyagabOtE gOLLu kandEnu.

kOrikalu teerucunnavi avi pErucunnavi

థాంక్స్ అజ్ఞాత గారు పోస్ట్ లో సరిచేశానండీ.. ఇంత శ్రద్దగా ఫాలో అవుతున్నందుకు మీకూ రామకృష్ణారావు గారికీ ధన్యవాదాలు.

ఓల్డ్ క్లాసిక్..

అవును శాంతి గారు.. థాంక్స్ ఫర్ ద కామెంట్..



పందిట్లో భళి పెళ్ళవు
తోందండి జిలేబి యమ్మి తోడుగ మగ డై
డెందంబారగ యానం
బందుకొనునిక నతడే గబగబాల్మనగా :)

జిలేబి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.