గురువారం, సెప్టెంబర్ 06, 2018

పెళ్లి ముహూర్తం కుదిరిందా...

అర్ధాంగి చిత్రంలోని ఒక సరదా ఐన పాట ఈ రోజు తలచుకుందాం.. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : అర్ధాంగి (1955)
సంగీతం : బి.నరసింహారావు    
సాహిత్యం : ఆత్రేయ  
గానం : పి.లీల, జిక్కి, బృందం   

పెళ్లి ముహూర్తం కుదిరిందా
పిల్లా నీ పొగరణిగిందా
పెళ్లి ముహూర్తం కుదిరిందా
పిల్లా నీ పొగరణిగిందా


భలే మొగుణ్ణి పట్టావు
భలే మొగుణ్ణి పట్టావు
ముసళ్ళ పండగ ముందేలే.. ఏ.. ఏ..
ముసళ్ళ పండగ ముందేలే
అసలు వడ్డీ యివ్వాల్లే
పిల్లా నీ పొగరణిగిందా

పెళ్లి ముహూర్తం కుదిరిందా
పిల్లా నీ పొగరణిగిందా


మహరాజింటి మనువంటె
మజాక అనుకున్నావంటే!
మహరాజింటి మనువంటె
మజాక అనుకున్నావంటే!

బంగరు నగలు రంగులరాళ్ళు
బంగరు నగలు రంగులరాళ్ళు
బారీ కోకలు పట్టు రైకలు
గంగిరెద్దులా సింగారించి
గాడిద బరువూ మోయాలోయ్‌ పిల్లా
గాడిద బరువూ మోయాలోయ్‌
పిల్లా నీ పొగరణిగిందా పొగరణిగిందా

పెళ్లి ముహూర్తం కుదిరిందా
పిల్లా నీ పొగరణిగిందా 

  
పెత్తన మొస్తుందనుకోకు
నెత్తికి కళ్ళు రానీకు
పెత్తన మొస్తుందనుకోకు
నెత్తికి కళ్ళు రానీకు
అత్తా మామా ఉన్నారూ
అత్తా మామా ఉన్నారూ
నీ సత్తా ఏమో చూస్తారు
పిల్లా నీ పొగరణిగిందా

పెళ్లి ముహూర్తం కుదిరిందా
పిల్లా నీ పొగరణిగిందా


పరదా లోపల మురగాలి
తిరిగే కాలు నిలవాలి
పరదా లోపల మురగాలి
తిరిగే కాలు నిలవాలి
పలుకూ తీరూ మారాలి
పలుకూ తీరూ మారాలి
నీ తల బిరుసంతా తగ్గాలి
పిల్లా నీ పొగరణిగిందా.. 

పెళ్లి ముహూర్తం కుదిరిందా
పిల్లా నీ పొగరణిగిందా
పొగరణిగిందా పొగరణిగిందా  


2 comments:

సరదాగా సాగుతూనే జమిందారీ సాంప్రదాయాలు కూడా సున్నితంగా చెప్పారీ పాటలో..

అవును శాంతి గారు.. థాంక్స్ ఫర్ ద కామెంట్..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.