కృష్ణాష్టమి సంధర్బంగా ఆ కన్నయ్య పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : కృష్ణలీలలు (1959)
సంగీతం : సుసర్ల దక్షిణామూర్తి
సాహిత్యం : కొసరాజు
గానం : మాధవపెద్ది, స్వర్ణలత
గొల్లవారి వాడలోన చిన్నిక్రిష్ణమ్మా
చల్లనయ్యా పుట్టినాడే చిన్ని క్రిష్ణమ్మా
గొల్లవారి వాడలోన చిన్నిక్రిష్ణమ్మా
చల్లనయ్యా పుట్టినాడే చిన్ని క్రిష్ణమ్మా
మా పాలి దేవుడై పుట్టాడురా
రేపల్లెకే వన్నె తెచ్చాడురా
ఆపదలు కాయంగ వచ్చాడురా వచ్చాడురా
ఆపదలు కాయంగ వచ్చాడురా
అందరికీ ఆనందమిచ్చాడురా
గొల్లవారి వాడలోన చిన్నిక్రిష్ణమ్మా
చల్లనయ్యా పుట్టినాడే చిన్ని క్రిష్ణమ్మా
ఒహొ చిన్నారి పొన్నారి చిన్నవాడు
కళ్లల్లో మెరిసేటి అందగాడు ఒహ్ చిన్నారి
ఒహ్ చిన్నారి పొన్నారి చిన్నవాడు
కళ్లల్లో మెరిసేటి అందగాడు
నవ్వుల్లో పువ్వుల్లు చల్లువాడు ఓఓఓఓఓ
నవ్వుల్లో పువ్వుల్లు చల్లువాడు
నందయ్య ఇలవేల్పు నల్లవాడు
గొల్లవారి వాడలోన చిన్నిక్రిష్ణమ్మా
చల్లనయ్యా పుట్టినాడే చిన్ని క్రిష్ణమ్మా
తందనాల పాటలు పాడండయ్యా
తప్పెట్లు తాళాలు కొట్టండయ్యా
శివమెత్తి సుద్దులు చెప్పండయ్యా
చిందులేసి సంబరాలు చేయండయ్యా
గొల్లవారి వాడలోన చిన్నిక్రిష్ణమ్మా
చల్లనయ్యా పుట్టినాడే చిన్ని క్రిష్ణమ్మా
2 comments:
మీకూ మీ కుటుంబానికీ జన్మాష్టమి శుభాకాంక్షలు వేణూజీ..
థాంక్స్ శాంతి గారు మీకు కూడా జన్మాష్టమి శుభాకాంక్షలు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.